కోలీవుడ్ సెన్సేషన్ : సంచలనం రేపుతున్న 96 మూవీ..!

Wednesday, November 14th, 2018, 06:39:06 PM IST

విజయ్ సేతుపతి, త్రిష కలయికలో ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ తో సంచలనం సృష్టిస్తున్న సినిమా 96. దీపావళి సందర్బంగా ఈ సినిమా టీవిలో ప్రసారం అయింది. అయినా కూడా థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాల్ని ప్రేక్షకులు ఎపుడూ ఆదరిస్తారని ఈ సినిమా రుజువు చేసింది. పాజిటివ్ టాక్ తో పాటు, మౌత్ టాక్ కూడా ఈ సినిమా విజయానికి కారణం అయింది.

96 టెన్త్ బ్యాచ్ రీయూనిన్ నేపథ్యంగా తీసిన ఈ సినిమా కథ గతంలో ప్రేమలో పడిన జంట చుట్టూ తిరుగుతుంది. రీయూనిన్ అయిన 96 బ్యాచ్ తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. ఈ క్రమంలో ప్రేమ జంట తమ ఎమోషన్స్ ని ఎలా షేర్ చేసుకుంటాయి అన్నది ఈ సినిమా కథ. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా అందరి మనసుల్ని హత్తుకున్నా ఈ సినిమా థియేటర్స్ లో ఉండగానే దీపావళి సందర్బంగా టీవిలో ప్రసారం చేసారు. దీంతో కలెక్షన్స్ మీద దెబ్బ పడుతుందని ఈ సినిమా యూనిట్ కంగారు పడింది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ ని టీవిలో ప్రసారం అవటం ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయింది. గత వారాంతంలో కొన్ని థియేటర్లలో 96 సినిమా హౌసుఫుల్ అయ్యి అందరికి షాక్ ఇచ్చింది. మంచి సినిమాను పైరసీ కాదు కదా ఏదీ తొక్కేయాలదని ఈ సినిమా విషయంలో ప్రూవ్ అయింది. పైరసీ వచ్చినా కూడా జనాలు ఈ సినిమాని థియేటర్లలో చూడటానికే ఇష్టపడుతుండటం ఇందుకు ఉదాహరణ. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, త్రిషల నటనను అందరు పొగుడుతున్నారు. ఇంకా ఎంత కాలం ఈ సినిమా థియేటర్లలో నడుస్తుందో చూడాలి.