టాలీవుడ్ ట్రెండింగ్ లీక్స్.. 96 మూవీ రీమేక్‌.. స్టార్ హీరో ఫిక్స్‌..?

Saturday, November 17th, 2018, 12:52:18 PM IST

కోలీవుడ్ సెన్షేష‌న్ హీరో విజయ్ సేతుపతి -త్రిష కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 96 మూవీ సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో విజ‌య్-త్రిష‌ల కెమిస్ట్రీకి ఫిదా అద‌రిపోయిన విష‌యం తెలిసిందే. దీంతో దీపావ‌ళికి బుల్లితెరలో ఈ సినిమాని ప్ర‌సారం చేసినా.. ఆన్‌లైన్‌లో వ‌చ్చినా, ఇప్ప‌టికీ థియేట‌ర్స్‌లో 96 మూవీ డిమాండ్ త‌గ్గ‌లేదంటే ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉందో అర్ధ‌మ‌వుతోంది.

అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాల‌ని దిల్‌రాజు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో 96 తెలుగు రైట్స్ దిల్ రాజు తీసుకున్నాడ‌ని.. రానా- త్రిష‌లు ఈ చిత్రంలో న‌టించ‌నున్నార‌నే టాక్ కూడా విన‌ప‌డింది. ఇక ఆ తర్వాత ఈ చిత్రంలో నాని, స‌మంత‌లు న‌టించనున్నార‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే త‌న‌కు సెట్ కాద‌ని నాని ఈ ప్రాజెక్ట్‌ని రిజెక్ట్ చేశాడ‌ని వార్త‌లు కూడా జోరుగా ప్ర‌చారం అయ్యాయి.

ఇప్పుడు క‌ట్ చేస్తే 96 తెలుగు రీమేక్‌లో అల్లు అర్జున్ న‌టించ‌నున్నార‌నే వార్త‌లు టాలీవుడ్‌లో స్ప్రెడ్ అవుతున్నాయి. ఇటీవ‌ల 96 చూసిన బన్నికి ఈచిత్రం బాగా న‌చ్చింద‌ని, దీంతో ఎలాగైనా ఈసినిమాను తెలుగులో రీమేక్ చేయాలనీ గట్టిగా ఫిక్స్ అయ్యాడని స‌మాచారం. మరి ఈ చిత్రంలో 38 ఏళ్ల వ‌య‌సున్న క్యారెక్ట‌ర్‌లో విజ‌య్ న‌టించాడు.. మ‌రి బ‌న్నీకి ఈ క్యారెక్ట‌ర్ సెట్ అవుతుందా.. దిల్‌రాజు ఒప్పుకుంటాడా.. ఒక‌వేళ ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే.. విజ‌య్ ఒదిగిపోయిన రామ‌చంద్ర‌న్ పాత్ర‌కి బ‌న్ని న్యాయం చేస్తాడా.. జాన‌కిగా కుర్ర‌కారుని మైమ‌ర‌పించిన త్రిష పాత్ర‌లో ఎవ‌రిని తీసుకుంటారు.. అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. దీంతో 96 రీమేక్ ఇప్పుడు సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.