షాక్ షాక్‌ : 9పీఎం జ‌న‌సేనాని లైవ్ షో

Sunday, April 22nd, 2018, 11:19:09 AM IST

షాక్ షాక్ షాక్‌.. షేక్ షేక్ షేక్‌.. ఇదీ జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎటాకింగ్‌ స్టైల్‌. ఇన్నాళ్లు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌పై క‌క్ష తీర్చుకునే ప‌నులు చేసిన ప్ర‌ధాన తెలుగు మీడియా తాట తీసే ప‌నిలో ప‌డ్డాడిక‌. ఇదిగో ఇదే అందుకు సాక్ష్యం. శ్రీ‌రెడ్డి అనే పిల్ల చేప‌ని వెన‌క‌బెట్టుకుని, ప‌వ‌న్‌పై ఎంత పెద్ద కుట్ర‌కు తెర‌లేపారో చూస్తే రాష్ట్రంలో ఏ తీరుగా రాజ‌కీయాలు సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కంపు కొట్టే రొంపిలో రామ్‌గోపాల్ వ‌ర్మ లాంటి మేధావి ఉన్నాడంటే, ఆ వెన‌క బిగ్ ఫిష్ ఇంకేదో ప‌ని చేస్తోంద‌ని జ‌నాల‌కు సందేహం క‌లిగింది.

అయితే ఇక ప‌వ‌న్‌పై మీడియా ప్ర‌ముఖులు, టీవీ చానెల్ ఓన‌ర్లు సాగిస్తున్న అరాచ‌క కాండ చూస్తుంటే, ప‌వ‌న్ ప‌దే ప‌దే త‌న‌ని `చంపేస్తారు` అన్న మాట మాట్లాడ‌డం వెన‌క అస‌లు కార‌ణం అర్థం చేసుకోవ‌చ్చు. రాజ‌కీయ నాయ‌కులు- మీడియా-టీవీ చానెళ్లు క‌లిపి ప‌న్నే ఉచ్చులో తాను ఉన్నాన‌ని ప‌వ‌న్ ప‌దే ప‌దే జ‌నాల‌కు చెప్పే ఉద్ధేశంలోనే `చావు` అనే మాట‌ను ప్ర‌స్థావిస్తున్నాడు. ఇప్పుడు `చావు`కు ఎదురెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఆ చావుతోనే పెట్టుకున్నాడు. తొలి అడుగు ఓ ప్ర‌ముఖ టీవీ చానెల్ అధినేత‌.. అత‌డి భోగోతాల్ని వీడియో ఆధారాల రూపంలో బ‌య‌ట‌పెట్టేందుకు ప‌వ‌న్ రెడీ అవుతున్నాడు. ఇదిగో ఇక్క‌డ ఈ వీడియోనే ప్ర‌త్య‌క్ష సాక్ష్యం. ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్వ‌యంగా ఇలా టీవీ చానెల్ అధినేత కాళ్లు ప‌ట్టుకుంటున్న ఓ రాజ‌కీయ నాయ‌కుడి వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట‌పెట్టారు. “ర‌వి, ఇదిగో ఇదే 9పీఎం షో నీ కోస‌మే“ నంటూ ట్వీట్ చేసి క‌ల‌క‌లం సృష్టించాడు. ఈ వీడియోలో టీవీ 9 ర‌విప్ర‌కాష్ కాళ్ల‌కు మొక్కుతోంది గుడివాడ అమ‌ర్‌నాథ్‌. ఇంత‌కీ ఆయ‌నేం త‌ప్పు చేశారు? ఎందుకిలా కాళ్లు ప‌ట్టారు? ఈ గేమ్‌లో ఏమైనా డ‌బ్బు చేతులు మారిందా? వ‌ంటి విష‌యాల్ని ప‌వ‌న్ త‌న మీడియా లైవ్‌లో చూపించ‌బోతున్నారా? …. జ‌స్ట్ వెయిట్..

ఇదిలా ఉండ‌గానే, మ‌రోవైపు వేరొక టీవీచానెల్ అధినేత రాధాకృష్ణ‌ లైన్‌లోకొచ్చారు. “బట్టలూడదీసి మాట్లాడుకుందాం – బట్టలూడదూసి కొడదాం .. కార్యక్రమానికి మీకు స్వాగతం“ అంటూ ఆర్కే ప‌వ‌న్‌కి ట్విట్ట‌ర్‌లో స‌వాల్ విసిరారు. అస‌లు ఏపీ రాజ‌కీయాల్లో ఏం జ‌ర‌గ‌బోతోంది? ప‌వ‌న్‌ని ఎవ‌రు ఏం చేయ‌ద‌లిచారు???? ఇంత‌కీ ముందుగా `చావు` ఎవ‌రికి?????????????

  •  
  •  
  •  
  •  

Comments