ఛేజింగ్ వీడియో : పోలీసులనే కంగారు పెట్టిన పదేళ్ల పిల్లడు

Monday, October 30th, 2017, 12:59:19 PM IST

తెలిసి చేస్తారో తెలియక చేస్తారో గాని కొంత మంది పిల్లలు చేసే పనులు చాలా ప్రమాదాన్నిసృష్టిస్తాయి. అమెరికాలో 10 ఏళ్ల బాలుడు చేసిన పని గురించి తెలిస్తే ఎంతవారైన షాక్ అవ్వాల్సిందే. పదేళ్ల పిల్లడు అమెరికా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. కార్ డ్రైవింగ్ అంటే ఎంత ఇష్టమే గాని సినిమా సిన్ ని తలపించాడు. వివరాల్లోకి వెళితే ఒహాయో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్ ప్రాంతానికి చెందిన పదేళ్ల బాలుడు ఎవ్వరికి అనుమానం రాకుండా తల్లి యొక్క ఫ్రెండ్ కారును తీసుకొని పారిపోయాడు.

విషయం తెలుసుకున్న తల్లి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారాన్ని అందించడంతో ఆమెతో పాటు పోలీసులు కూడా ఆ కుర్రాడి కారును ఫాలో చెయ్యడం మొదలు పెట్టారు. దాదాపు
160 కిలో మీటర్ల వేగంతో కారును పోనించడం అందరిని షాక్ కి గురి చేసింది. పోలీసులు కష్టపడి కారును ఆపే ప్రయత్నం చేయడానికి ట్రిక్స్ ఉపయోగించినా బాలుడు కారును రోడ్డు కిందకు పోనిచ్చి ఛేజింగ్ ను మరింత భయంకరంగా మార్చాడు. కానీ పోలీసులు అతన్ని ఫైనల్ గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments