వర్మ పై పోలీసులకు ఫిర్యాదు!

Thursday, January 25th, 2018, 04:05:57 PM IST


సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ ఏమి చేసినా సంచలనమే. ఆయన ప్రస్తుతం నటి మియా మాల్కోవా పై తీస్తున్న మూవీ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్. ఈ చిత్రం ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో పెను సంచలనమే రేపుతోంది. ఈ చిత్రం విషయమై నిన్న నెట్ ఓ విడుదలైన మియా అశ్లీల చిత్రాలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఈ చిత్రం విషయమై ఇటీవల ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో వర్మ తో చర్చలో పాల్గొన్న సామాజిక కార్యకర్త దేవి ఆయన పై సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పై వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ లకు విజ్ఞప్తి చేశారు. ఈ జరిగిన చర్చ వాడివేడిగా సాగినట్లు ఇద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం రేపు ఇంటర్నెట్ లో విడుదల కానుంది. ఇప్పటికే పలు వివాదాలకు దారితీస్తున్న ఈ చిత్రం, విడుదల తర్వాత ఇంకెన్ని సంచలనాలకు తెరతీస్తుందో అని సినీ వర్గాలలో చర్చ మొదలయింది….