సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైన యువతి!

Thursday, May 24th, 2018, 12:32:23 PM IST

ఇటీవల అవగాహనా లోపంతో యుక్త వయసులో వున్నవారు లేనిపోని చిన్న చిన్న కారణాలతో తమ నిండు నూరేళ్ళ జీవితాన్ని క్షణికావేశంలో బలి చేసుకుంటున్నారు. దేశంలో తరచూ యువతీ, యువకుల బలవన్మరణాలు కథనాలు వెలువడుతూనే వున్నాయి. క్షణికావేశం వద్దని, ఒక్కసారి మన జీవితం గురించి, మనల్ని నమ్ముకుని వున్న కుటుంబసభ్యుల గురించి ఆలోచించి ధైర్యంగా ముందుకు సాగాలేతప్ప అంతా అయిపొయింది అనుకొని జీవితాన్ని అంతం చేసుకోవడం పరిష్కారం కాదని మానసిక నిపుణులు ఎందరు చెపుతున్నా ప్రయోజనం మాత్రం ఉండడంలేదు. ఇటీవల ఒక యువతి ఎటువంటి కారణం లేకుండా ఒక సూసైడ్ లెటర్ రాసి నేను చనిపోతున్నాను అని ఇంటినుండి వెళ్ళిపోయింది. ఇక విషయంలోకి వెళితే, మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట కు చెందిన వెంకటయ్య బ్రతుకు జీవనం కోసం హైదరాబాద్ లోని షేక్ పెట్ లోని ఆల్ హమ్రా ప్రాంతంలో నివాసముంటున్నాడు.

వృత్తి రీత్యా లేబర్ గా పనిచేస్తున్న వెంకటయ్య తన ఆర్ధిక పరిస్థితి సరిగా లేకపోయినప్పటికీ కష్టపడి తన ఒక్కగానొక్క కూతురు యామిని రేతిబౌలి లోని ఒక ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదివిస్తున్నాడు. రోజూలానే పని ముగించుకుని నిన్న ఇంటికి చేరిన వెంకటయ్యకు ఇంట్లో కూతురు రాసి పెట్టిన ఒక లేఖ కంటపడింది. నాకు జీవితం మీద విరక్తిగా వుంది, ఇకపై జీవించాలని లేదు, నా చావుకు ఎవరూ కారణాం కాదు, అందుకే ఆత్మహత్య చేసుకుని చనిపోవటానికి వెళ్తున్నాను అని లెటర్ రాసి పెట్టింది. ఆ లేఖ చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన వెంకటయ్య తన బంధువులు, స్నేహితుల ఇళ్లలో యామిని కోసం వెతక సాగాడు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. దానితో గోల్కొండ పోలీస్ లకు ఫిర్యాదు చేసాడు. వెంకటయ్య ఫిర్యాదును స్వీకరించిన ఎస్ఐ సతీష్ రెడ్డి వెంటనే విచారణ చేపట్టి యామినిని అతిత్వరలో వెతికి పట్టుకుంటామని చెపుతున్నారు ……

  •  
  •  
  •  
  •  

Comments