నా భార్యను నిత్యానంద చెరనుండి విడిపించమని వ్యక్తి ఫిర్యాదు!

Wednesday, June 13th, 2018, 01:34:16 AM IST

స్వామి నిత్యానందపై ఇదివరకు పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. కాగా నేడు ఆయనపై మరొక ఫిర్యాదు నమోదు చేయబడింది. వివరాల్లోకి వెళితే తమిళనాడులోని నమ్మక్కల్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన భార్య మరియు కుమారుడు కొన్ని నెలలక్రితం స్వామి నిత్యానంద ఆశ్రమానికి వెళ్లారని, అయితే వెళ్ళినవాళ్ళు మళ్లి ఇంటికి తిరిగిరాలేదని, భయం వేసి విషయాన్నీ స్థానిక పోలీస్ లకు మరియు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. అయితే పోలీస్ లు ఈ కేసు విషయమై గట్టిగా చొరవ తీసుకోవడంతో మొత్తానికి తన కుమారుడు బెంగళూరులో కొన్నాళ్ల క్రితం దొరికాడని, కానీ తన భార్య జాడ మాత్రం ఇప్పటివరకు తెలియలేదని అతను వాపోయాడు.

వాస్తవానికి తన భార్య పేరిట బ్యాంకు లో తీసుకున్న ఋణం రూ.5 లక్షలు, అలానే బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మరొక రూ. 11 లక్షలు, నాగల ఋణం రూ.30 వేలు, ఇక మరొక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వద్ద తీసుకున్న రుణమ్ మరొక రూ.5లక్షలు. వెరసి మొత్తం రూ.22 లక్షల పైచిలుకు అప్పులు తమకు ఉన్నవని, ఇదంతా నిత్యానంద స్వామిజీ నిర్వహించే ధ్యాన తరగతులకు వినియోగించామని అన్నారు. నిత్యానందే తన భార్యను ఏదో చేసి ఉంటాడని, ఇప్పటికే అప్పు తీర్చమని బ్యాంకు అధికారులు, ఇతర వ్యక్తులు ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని, కావున నిత్యానందపై కఠిన చర్యలు తీసుకుని అతని బారి నుండి న భార్యను విడిపించమని ఫిర్యాదులో పేర్కొన్నాడు…..

  •  
  •  
  •  
  •  

Comments