అయ్యో..చంద్రబాబు ఏంటి ఇలా అయ్యిపోయారు..!

Saturday, October 13th, 2018, 03:01:07 PM IST

అది చూస్తే ఎదో హోటల్ లా ఉంది.అక్కడికి ఎవరో తినడానికి కూర్చున్నారు వాళ్ళ దగ్గరే ఒక సర్వర్ కూడా ఉన్నాడు.వారికేదో వడ్డించేసి తన మానాన తాను వెళ్ళిపోయాడు.దీనికి చంద్రబాబుకి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా..?ఉంది.ఈ రోజుల్లో ఏదైనా సంచలన వార్త వస్తే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యిపోతుంది.ఇప్పుడు కూడా ఒక వీడియో పెను సంచలనంగా మారిపోయింది.ఎందుకంటే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి అచ్చు గుద్దినట్టు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు లాగే ఉన్నారు.ఎవరైనా చూసినా అది చంద్రబాబే అనుకుంటారు.ఆ వీడియోలో ఉన్న వారికి ఎదో వడ్డించి అటుగా వెళ్ళిపోతున్నప్పుడు ఒక్క లుక్ ఇచ్చారు అంటే ఇక ఎవ్వరైనా సరే అది మన బాబు గారే అని చెప్పాల్సిందే..ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.