ప్రముఖ టివి ఛానల్ ఎండిని అని చెప్పి ఏమి చేసాడో తెలుసా?

Friday, April 13th, 2018, 07:15:36 PM IST

కొందరు మగవాళ్లు అమాయక యువతులను, బడాబాబులమని చెప్పి మోసగించడం ఈ కాలంలో ఎక్కువయింది. అయితే అందులో కొందరు అమ్మాయిలు తెలివిగా వ్యవహరించి తప్పించుకుంటున్నప్పటికీ, మరికొందరు అటువంటి వారి ఉచ్చులో పడి బలైపోతున్నారు. ఇటీవల ఈ విధమైన ఉదంతం ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తోంది. తాను ఒక స్పోర్ట్స్ ఛానల్ యజమానిని అని చెప్పుకుంటూ ఆరుగురు అమ్మాయిలను మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే, అనురాగ్ అనే వ్యక్తి ద్వారకలో ప్రాపర్టీ డీలరుగా పని చేస్తున్నాడు.

అతనికి ఇప్పటికే పెళ్లి అయిన ఒక కుమారుడు కూడా ఉన్నాడు. లక్నోకు చెందిన ఇతను బీబీఏ డిగ్రీ చదివి, ఢిల్లీలో కొన్నాళ్లు బ్యాంకు సేల్స్ మేనేజరుగా కూడా పని చేశాడు. ప్రస్తుతం ఉద్యోగాన్ని వదిలేసిన ఆయన, తాను ఛానల్ అధిపతినని, తనకు వధువు కావాలంటూ వెబ్ సైట్లలో ప్రకటన ఇచ్చాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానంటూ ఓ అమ్మాయితో చాటింగ్ చేశాడు. ఆ తర్వాత తన తండ్రిని క్యాన్సర్ చికిత్స కోసం లండన్ తీసుకొచ్చానని, లండన్ నంబర్ వచ్చేలా లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో ఆమెకు ఫోన్ చేశాడు. తనకు అత్యవసరంగా డబ్బు అవసరం అని చెప్పడంతో, ఆమె అతని ఖాతాలో రూ. 6 లక్షలు వేసింది.

ఆ తర్వాత ఆ డబ్బు తిరిగి ఇవ్వమని అడగ్గా ఆమెను బెదిరించాడు. ఆ తర్వాత అతను చెప్పిన ముంబైలోని టీవీ ఛానల్ చిరునామాకు ఆ యువతి వెళ్లగా, ఆ పేరుగలవారు అక్కడ ఎవరూ లేరని తేలింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఒకరు కాదు ఇద్దరుకాదు, ఏకంగా ఆరుగురు అమ్మాయిలను అతను మోసం చేశాడని తేలింది. ప్రస్తుతం అతనిపై కేసు నమోదుచేసి, అరెస్ట్ చేసిన పోలీస్ లు ప్రాధమిక విచారణ చేపట్టారు…..