బిర్యానీ తేవడం లేటైందని గన్ తో బెదిరింపు !

Saturday, January 27th, 2018, 12:50:44 AM IST


ఇటీవలి కాలంలో ప్రతి వస్తువు అవకాశం ఉన్నంత వరకు అందరూ ఆన్ లైన్ లోనే ఆర్డర్ చేస్తున్నారు. చివరికి తినే తిండి కూడా. అయితే అవి మనకు సకాలంలో చేరితే ఓకే, ఒక వేళ చేరకపోతే కస్టమర్ ఆగ్రహానికి గురికాక తప్పదు, పరిస్థితిని అర్ధంచేసుకుని కొంతమేరకు సర్దుకునే వాళ్ళూ వుంటారు. కానీ ఇవ్వాళ హైరాబాద్ మహానగరంలో జరిగిన సంఘటన వింటే ప్రతిఒక్కరికి షాక్ కొడుతుంది. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ కు చెందిన శైలేంద్ర గురువారం బిర్యానీ కోసం స్విగ్గీ యాప్ ద్వారా ఆర్డర్ చేశారు. అయితే సదరు డెలివరీ బాయ్ దానిని శైలేంద్ర ఇంటికి తెచ్చేందుకు ఒక అరగంట ఆలస్యం అవడంతో, ఎందుకు ఆలస్యంగా తెచ్చావంటూ డెలివరీ బాయ్ రాజును గన్ తో బెదిరించారు. ఆ సంఘటనకు బెదిరిపోయిన రాజు సంజీవరెడ్డి నగర్ పోలీస్ లకు శైలేంద్ర పై ఫిర్యాదు చేసాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…..