చంద్రబాబుకి గాంధీ గారన్నా,ఆయన సూక్తులన్నా గౌరవం లేదు!

Monday, October 1st, 2018, 07:07:19 PM IST

ఈ రోజు విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన ఒక మీటింగు నిమిత్తం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి ఆళ్ళ రామకృష్ణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు నాయుడు గారికి జాతిపిత గాంధీ గారన్నా అంబెడ్కర్ గారన్నా ఆయన లెక్క చెయ్యరని సంచలన వ్యాఖ్యలు చేశారు.దీనిపై మాట్లాడుతూ అమరావతిలో బాబు ఏర్పాటు చేస్తానన్న 120 అడుగుల విగ్రహం సంగతి ఏమయ్యిందని ప్రశ్నించారు.

అంతే కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రజాస్వామ్యం అన్నా,గాంధీజీ గారి సూక్తులన్నా నచ్చవని తెలిపారు.గాంధీ గారి యొక్క మార్గానికి కూడా చంద్రబాబు ఎప్పుడు గౌరవం ఇవ్వలేదు,కనీస విలువలు కూడా చంద్రబాబు నాయుడు పాటించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ కారణం చేతనే బాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ముందు గాంధీజీ గారి విగ్రహాన్ని మరియు అంబెడ్కర్ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చెయ్యలేదని తెలిపారు. ఇప్పటికైనా సరే మేల్కొని అసెంబ్లీకి ముందు వారి ఇరువురి ప్రతిమలను ఏర్పాటు చెయ్యాలని సూచించారు.