సల్మాన్ కు అమీర్ పరామర్శ!

Thursday, May 7th, 2015, 03:58:20 PM IST

salman-and-amirkhan
ప్రముఖ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో దోషిగా తేలడంతో ఐదేళ్ళు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. అయితే సల్మాన్ కు శిక్ష పడడంపై బాలీవుడ్ వర్గాలు, అతని అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖ హీరో అమీర్ ఖాన్ సల్మాన్ ను కలిసి పరామర్శించారు. ఇక ముంబై బాంద్రా ప్రాంతంలోని గేలక్సీ అపార్ట్ మెంటులో నివాసం ఉంటున్న సల్మాన్ ను అమీర్ ఖాన్ వెళ్లి కలిశారు. అనంతరం తిరిగి వెళ్ళే సమయంలో ఇంటి వెలుపలకు వచ్చిన అమీర్ ను సల్మాన్ ఆలింగనం చేసుకున్నారు.

ఇక మధ్యంతర బెయిలుపై విడుదలైన సల్మాన్ ఖాన్ ను పరామర్శించేందుకు బాలీవుడ్ తారాగణం దిగి వచ్చింది. ఇక వీరిలో సొనాక్షీ సిన్హా, ప్రీతి జింటా, రాణి ముఖర్జీ, సంగీతా బిజిలానీ, బిపాసాబసు, సునీల్ శెట్టి, సోనూ సూద్ తదితరులు బుధవారం సల్మాన్ ను కలిసి పరామర్శించిన వారిలో ఉన్నారు.