అమీర్ ఖాన్ పై మోడీ పగ..సాక్ష్యం ఇదేనా..?

Wednesday, December 28th, 2016, 04:48:01 PM IST

snapdeal
బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ పై ప్రధాని మోడీ పగపట్టరా ? దీనికి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ మధ్యన ‘అసహనం’ అంశం పై అమీర్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించాయి. అటు రాజకీయ వర్గాలనుంచి ఇటు అభిమానుల నుంచి అమిర్ పెద్దఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. దేశం లో అసహనం పెరిగిపోయిందని తన భార్య వేరే దేశానికీ వెళ్ళిపోదామని వ్యాఖ్యానించిందని అమిర్ అనడం దుమారం రేపింది. అమిర్ చేసిన ఈ వ్యాఖ్యలు అధికార పార్టీ బీజేపీకే తగిలాయి. దీనితో అప్పట్లో బిజెపి నేతలు అమిర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అమీర్ వ్యాఖ్యల్ని ప్రధాని మోడీ వరకు చేరాయని.. ఆయన దీనిని సీరియస్ గా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా స్వాతి చతుర్వేది అనే జర్నలిస్టు తన పుస్తకం ద్వారా ఈ అంశాన్ని మరో మారు తెర మీదికి తీసుకుని వచ్చింది. ‘ ఐ యామ్ ఎ ట్రాల్ ‘ అనే తన పుస్తకం లో అమిర్ పై బిజెపి వైఖరిని వివరించింది. ప్రముఖ ఈ కామర్స్ సైట్ ‘స్నాప్ డీల్’ అమిర్ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వెనుక మోడీ హస్తం ఉందని ఆమె అభియోగించింది. స్నాప్ డీల్ కు గతం లో అమిర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. కానీ అతని కాంట్రాక్టుని ఆ సంస్థ పొడిగించలేదు. బిజెపి సాంకేతిక విభాగం అమీర్ ఖాన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియా లో జరిపిన ప్రచారం వల్లే స్నాప్ డీల్ అమిర్ తో కాట్రాక్టుని రద్దు చేసుకుందని స్వాతి తన పుస్తకం లో పేర్కొంది. చిన్న పాటి వ్యతిరేక వ్యాఖ్యలనైనా మోడీ ఎందుకు సహించలేక పోతున్నారని స్వాతి చతుర్వేది పేర్కొన్నారు. ఓ జర్నలిస్టుగా మోడీ తీరుని సమర్ధించ లేక పోతున్నానని ఆమె పేర్కొనడం విశేషం.

  •  
  •  
  •  
  •  

Comments