అమీర్ ‘పీకే’ సరికొత్త రికార్డులు..!

Saturday, December 27th, 2014, 12:11:57 AM IST

pk
బాలీవుడ్ లో సరికొత్త రికార్డు క్రియేట్ అయింది. అమీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘పీకే’ సరి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అమీర్ ఖాన్ – రాజ్‌కుమార్ హిరాణీ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పీకే.. పాత రికార్డుల‌ను తిరగరాస్తోంది. తొలి వారంలోనే దాదాపుగా 200 కోట్లు సాధించింది. ధూమ్ 3 రికార్డును సైతం బద్దలు కొట్టింది. ధూమ్ 3 తొలి వారంతంలో రూ.180 కోట్లు వ‌సూలు చేసింది. ఇప్పుడు ఆ రికార్డును ‘పీకే’ మూవీ బ్రేక్ చేసింది.

తాజాగా వారాంతం శ‌ని, ఆది వారాల్లోనూ పీకే మరింతా జోరు చూపించే అవ‌కాశం ఉంది. ద‌గ్గర్లో పెద్ద సినిమాలేం రావ‌డం లేదు. ఈ నేపథ్యంలో పీకే హ‌వా మ‌రి కొన్ని రోజులు ఇలాగే కొన‌సాగితే.. బాలీవుడ్లోనే అత్యధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించ‌డం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు.