నిఘూ వ్యవస్థ ఏమైంది? – బాబు పై ఆనం ఫైర్..!

Tuesday, November 6th, 2018, 04:28:18 PM IST

వైసీపీ నాయకులు, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు పై మండి పడ్డారు. అమరావతిలో “నారాసుర ” వధ జరిగిన రోజే ఏపీకి అసలైన దీపావళి, అప్పుడే మంచి రోజులు వస్తాయని, ప్రజలు సంతోషంగా ఉంటారని అన్నారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని, ముఖ్యమంత్రి మొదలుకొని అందరు నాయకులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు.తితిలి తుఫాను బాధితులకు ఇచ్చే చెక్కులపై చంద్రబాబు బొమ్మ ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు. బాధితులను ఆదుకొనే సాయం ప్రభుత్వం చేయట్లేదని, ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను బయట పెట్టాలని చూస్తున్నారని అన్నారు. విపక్షాల నోరు నొక్కేస్తున్నారన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారని అన్నారు.

ఆపరేషన్ గరుడ పేరుతో ఎప్పటినుండో రాష్ట్రంలో అనూహ్య పరిస్థితులు నెలకొనబోతున్నాయి అని చెప్తున్న నటుడు శివాజీని ఎందుకు ప్రశ్నించడం లేదు అని నిలదీశారు, అలాంటి సున్నిత అంశం పై ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టటం లేదని ప్రశ్నించారు. శివాజీ ని ఎందుకు అదుపులోకి తీసుకొని ప్రశ్నించలేదంటూ డీజీపీ ని నిలదీశారు, ఇంటలిజెన్స్ చీఫ్, డీజీపీ ఏమయ్యారు అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు కూల్చేసి అంశాలు అంటూ అయన మాటాడుతుంటే ఎందుకు విచారించలేదంటూ నిలదీశారు.

రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకే చంద్రబాబు వ్యవస్థలను వాడుకుంటున్నారని ఆరోపించారు. బాబు తన స్వార్ధానికి వ్యవస్థలను వాడుకోవటం న్యాయం కాదన్నారు. జగన్ పై జరిగిన దాడి ఇంటలిజెన్స్ వైఫల్యం అన్నారు. పోలీస్ నిఘా వ్యవస్థ ఏమైందంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కూడా అరెస్ట్ చేయటం దారుణం అన్నారు. జాతీయ పార్టీలను కూడగట్టాను అంటూ తన అను”కుల” మీడియా ద్వారా కొట్టుకుంటున్న డప్పులో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు, కొత్తగా బాబు కూడగట్టడం ఏంటి? ఏనాడో వాళ్లంతా యూపీఏ కూటమిగా ఏర్పడ్డారని అన్నారు. బాబు చెప్పిన్నట్టు చేసేందుకు వాళ్ళు సిద్ధంగా లేరని అన్నారు,రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. బాబు యూ టర్నులు తీసుకుంటూ ఇతర పార్టీలను విమర్శిస్తున్నారంటూ ఆరోపించారు.

  •  
  •  
  •  
  •  

Comments