క్రైమ్ కహాని : కోర్టులో లొంగిపోయిన కైఫ్..ఏడుగురి భర్తల ఏకైక భార్య ..!

Wednesday, September 21st, 2016, 09:56:01 PM IST

మహమ్మద్ కైఫ్ లొంగిపోయాడు :1 మహమ్మద్ కైఫ్ లొంగిపోవడం ఏంటి అనుకుంటున్నారా.. క్రికెటర్ కాదులెండి. ఇతడు షార్ప్ షూటర్. బీహార్ పోలీస్ లు వెతుకుతున్న ఇతడు బుధవారం కోర్టులో లొంగిపోయాడు. జర్నలిస్టు రాజ్ దేవ్ రంజన్ హత్య కేసులో ఇతడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. జంట హత్యల కేసులో ఆరోపణలు యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ఇటీవల బెయిల్ పై విడుదలయ్యారు.ఆ సమయం లో ఇతడు మాజీ ఎంపీ పక్కనే ఉండడంతో బీహార్ రాజకీయాల్లో అగ్గి రాజుకుంది. కైఫ్ మాట్లాడుతో ఈ హత్యకు తనకు ఎటువంటి సంభందం లేదని అన్నాడు. రాజన్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నాడు.

మరో ఆప్ ఎమ్మెల్యే బుక్ అయ్యాడు :2 దేశ రాజధాని నగరం ఢిల్లీని పరిపాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లైంగిక వేధింపుల కేసులో మరో ఎమ్మెల్యే అరెస్టయ్యాడు. ఆప్ కి చెందిన ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ ని పోలీస్ లు బుధవారం అరెస్టు చేసారు.తన మరదలిపై లైంగిక దాడికి పాల్పడడంతో పోలీస్ లు అతనిని అరెస్టు చేశారు. ఈ మేరకు అయాన్ మరదలు జమియ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఖాన్ తన తో లైంగికంగా సంభందం పెట్టుకోమని వేధించేవాడని ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల ఢిల్లీ మంత్రి సందీప్ కుమార్ మహిళతో రాసలీలలు సాగిస్తూ అరెస్టైన సంగతి తెలిసిందే.

ఏడుగురు భర్తలను వంచించిన ఏకైక భార్య : 3ఏడుగురిని వివాహం చేసుకున్న ఓ మహిళా మోసకారి గురించిన నిజం బెంగుళూరులో బయటపడింది. కేజీ హళ్లి కి చెందిన యాస్మిన్ భాను అనే మహిళా 9 ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టాక అతడిని వంచించి రూ 10 లక్షల తో పరారైంది.బాగా డబ్బున్న వారిని టార్గెట్ చేసుకుని వారితో కొద్దిరోజులు కాపురం చేసి ఇంట్లోని నగదుతో పారిపోవడం చేస్తూ ఉండేది. ఇటీవలే ఆమె నాలుగో భర్తకు చేరువైంది. అతడు అనుమానంతో ఆమెపై పోలీస్ లకు ఫిర్యాదు చేసాడు.పోలీస్ లు ఆమె అరెస్టు చేసి ఆమె గురించి విచారించగా ఇదే విధంగా మీ ఏడుగురిని మోసం చేసినట్లు తెలుస్తోంది.కానీ ఆమె మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది.