బెంగుళూర్ వీధుల్లో డివిలియర్స్!

Friday, April 27th, 2018, 04:45:32 PM IST

ప్రపంచంలోనే అత్యంత వేగంగా బంతులను బలంగా కొట్టగల ఆటగాళ్లలో ఎబి.డివిలియర్స్ ఒకరు. అతను ఒక్కసారి ఫామ్ లోకి వచ్చాడంటే చాలు ఆపడం ఎవ్వరి వల్లా కాదు. సిక్సర్లను 360 డిగ్రీస్ లో చూపించేస్తాడు. ప్రస్తుతం డివిలియర్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ టీమ్ లో ఉన్నాడు. ఈ ఐపీఎల్ లో డివిలియర్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాడు. ఇకపోతే ఎంత సేపు ఏసీ గదుల్లో ఉండాలి అనుకున్నాడో ఏమో గాని వెంటనే బయట ప్రపంచంలో చక్కర్లు కొట్టాలనీ ప్లాన్ వేశాడు. తన భార్య కుమారుడ్ని తీసుకొని షేర్ ఆటోలో బెంగుళూరు విధుల్లో తిరిగాడు. అయితే డివిలియర్స్ అంటే తెలియని క్రికెట్ ఫ్యాన్ ఇండియాలో ఉండడు. దీంతో వెంటనే కొంత మంది అభిమానులు డివిలియర్స్ ని ఫాలో అవుతూ.. ఈ సారి మనమే గెలవాలని నినాదాలు చేశారు. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.