రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్…..షాక్ లో అభిమానులు

Wednesday, May 23rd, 2018, 06:33:56 PM IST

దక్షిణాఫ్రికా డాషింగ్ బ్యాట్స్ మాన్ ఎబి డివిలియర్స్ నేడు అనూహ్యంగా తన క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పారు. మిస్టర్ 360గా పేరుగాంచిన ఎబి అన్నిరకాల క్రికెట్ ఫార్మట్ లకు నేడు రిటైర్మెంట్ ప్రకటించారు. భవిష్యత్తులో కౌంటీ క్రికెట్ లో ఆడతానో లేదో చెప్పలేనన్నారు. ప్రస్తుతం ఆయన వయసు 34 సంవత్సరాలు. తన 14 ఏళ్ళ క్రికెట్ కెరీర్ లో 114 టెస్ట్ లు, 228 వన్డేలు, 78 టి20 మ్యాచ్ లు ఆడిన ఎబి, కెరీర్లో తన అద్భుత బాటింగ్ నైపుణ్యంతో విధ్వంసకర బ్యాట్స్ మాన్ గా పేరు గాంచాడు. ఇప్పటికే తాను కెరీర్ పరంగా అలసిపోయానని, ఇక క్రికెట్ కు సెలవు ప్రకటించే సమయం వచ్చిందని ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో పోస్ట్ చేస్తూ తెలిపారు.

ఇది ఇతరులకు అవకాశం ఇచ్చే సమయమని, తన కెరీర్ లో తనకు సహాయంగా నిలిచిన తన సహచర ఆటగాళ్లు, కోచ్ లు, అలానే తనను సెలెక్ట్ చేసిన సెలెక్టర్లకు ప్రత్యేక ధన్యవాదములు తెల్పున్నానని అన్నాడు. తన రిటైర్మెంట్ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని, తనను ఎంతో ప్రేమగా అభిమానించే అభిమానుల ఆశీస్సులు తనతో ఎప్పటికి మదిలో గుర్తుండిపోతాయని అన్నారు. కెరీర్ లో తొలి టెస్ట్, అలానే తొలి వన్డే ఇంగ్లాండ్ తో ఆడిన ఆయన, చివరి టెస్ట్ ఆస్ట్రేలియా తో, చివరి వన్డే ఇండియా తో ఆడారు. కాగా అయన ఇటీవల ఐపీఎల్ 11వ సీజన్లో బెంగళూరు రాయల్ ఛాలెంజెర్స జట్టులో ఆడిన విషయం తెలిసందే. అయితే నాలుగు రోజుల క్రితం ఆ జట్టు ఓటమి పాలయి ఐపీఎల్ నుండి నిష్క్రమించింది…..

  •  
  •  
  •  
  •  

Comments