జబర్దస్త్ లో గురు శిష్యుల ఎంట్రీ అదిరింది….!

Friday, May 17th, 2019, 03:39:12 PM IST

బుల్లి తెరపై అతి తక్కువ కాలంలో నంబర్ వన్ ప్రోగ్రాంగా పేరు సంపాదించుకున్నది జబర్దస్థ్. ఈ కామెడీ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారన్న సంగతి కూడా మనకి తెలిసిందే. అయితే ఇందులోని కంటెస్టెంట్లు తమ స్కిట్లతో, పంచ్ డైలాగ్‌లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. అప్పుడప్పుడు స్కిట్‌లో భాగంగా వీరు చేసే విన్యాసాలు, వేశాలు, డ్యాన్సులు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంటాయి. అయితే తాజాగా జరిగిన నిన్నటి ఎపిసోడ్‌లో చాలా రోజుల తరువాత ఒక అద్భుతమే జరిగిందని చెప్పుకోవాలి.

ప్రస్తుతం జబర్దస్త్‌లో తన పంచ్ డైలాగ్‌లతో అందరిని ఆకట్టుకుంటూ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు హైపర్ ఆది. ఇన్‌టైంలో తన డైలాగ్‌లతో ప్రేక్షకులనే కాదు అప్పుడప్పుడు జడ్జెస్, మిగతా కంటెస్టెంట్‌లను కూడా విస్మయానికి గురిచేస్తుంటాడు. అయితే ప్రస్తుతం ఆది జబర్దస్త్‌లో టీం లీడర్‌గా కొనసాగుతున్నాడు. అయితే ఆది జబర్దస్థ్‌కి వచ్చిన మొదట్లో అదిరే అభి టీంలో చేసేవాడని మనకి అందరికి తెలిసిందే. అయితే అక్కడ తన ట్యాలెంట్‌ని నిరూపించుకోవడంతో ఏకంగా టీం లీడర్ ఛాన్సే కొట్టేశాడు ఆది. అయితే దానికి అభి కూడా ఆదిలోని ట్యాలెంట్‌ని చూసి బాగానే ప్రోత్సహించాడు. అయితే టీం లీడర్ అయ్యాక గురువుకు తగ్గ శిష్యుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు ఆది. అయితే ఇలా చాలా రోజుల తరువాత ఈ గురు శిష్యులు ఇద్దరు కలిసి ఒకే స్కిట్‌లో కనపడ్దారు. నిన్నటి జబర్దస్త్ ఎపిసోడ్‌లో ఆది చేసిన స్కిట్‌లో అభి మెయిన్ క్యారెక్టర్‌లో కనపడ్డాడు. వీరిద్దరూ గతాన్ని గుర్తు చేసుకుంటూ వెన్నుపోటు పొడిచావని, మోసం చేసావని, అది ఇంకా మరిచిపోలేదని, అది మళ్ళీ గుర్తు చేయకు అని సరదాగా అందరిని నవ్వించడానికి వేసిన జోక్‌లు ప్రేక్షకులందరిని ఎంతగానో అలరించాయి. అంతేకాదు ఆ పంచులు వింటున్నంత సేపు జడ్జెస్ రోజా, మీనా యాంకర్ అనసూయ ఎంతగా నవ్వుకున్నారో అది మాటలలో చెప్పలేము. ఈ గురు శిష్యుల స్కిట్ మీరు చూడలేదా అయితే ఒకసారి చూడండి మీరు కూడా తనివి తీరా నవ్వుకోవడం ఖాయం.

  ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి