15 మంది ఎమ్మెల్యేలపై అనర్హతవేటు

Sunday, June 9th, 2013, 10:00:09 AM IST

అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్టీ విప్ లను ధిక్కరించిన 15 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ వేటు వేశారు. వీరిలో 9 మంది కాంగ్రెస్ కు చెందినవారు కాగా, ఆరుగురు టిడిపికి చెందినవారు.

వేటు పడిన ఎమ్మెల్యేలలో కాంగ్రెస్‌కు చెందిన సుజనకృష్ణ రంగారావు, ఆళ్ళనాని, ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి, చింతలపూడి రాజేష్, శివప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవి కుమార్, జోగి రమేష్, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, పేర్నినాని ఉన్నారు. టిడిపి నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, సాయిరాజ్, వనిత, కొడాలి నాని, బాలనాగిరెడ్డి ఉన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో రెండోసారి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ కి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు విప్ ను ధిక్కరించి జగన్ వర్గానికి అనుకూలంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జోగి రమేష్, శివప్రసాద్, పేర్ని నాని, ఆళ్లనాని, సుజయాకృష్ణ రంగారావు, గొట్టిపాటి రవికుమార్, చింతలపూడి రాజేష్ క్రాస్ ఓటింగ్ చేశారు. టీడీపీ జారీ చేసిన విప్ ను ఉల్లంఘించి కొడాలి నాని, అమర్నాధరెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, వనిత, సాయిరాజు, బాలనాగిరెడ్డి.లతో కలిపి మొత్తం ఆరుగురు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేశారు. కాంగ్రెస్ తో పాటూ టీడీపీ శాసనసభా పక్షం తరపున విప్ ను ధిక్కరించిన ౧5 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ స్పీకర్ కి పిటిషన్ ఇచ్చారు.

క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేలతో పలు దఫాలుగా స్పీకర్ మనోహర్ విచారణ జరిపి వారి వివరణ కూడా తీసుకున్నారు. తాజాగా వారిపై అనర్హతవేటు వేశారు.