అవినీతితో బొక్కసం నింపేస్తున్నారు! ప్రభుత్వ ఉద్యోగులా మజాకా!

Thursday, September 28th, 2017, 10:17:38 AM IST

దేశంలో అవినీతి, లంచగొండితనం, మామూళ్ళు పర్వం ఎక్కువడా ఉండేది ఇందులో అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో అని ఎవరైనా వెంటనే చెప్పేస్తారు. పొరుగు రాష్ట్రాల సంగతి ఏమో గాని అవినీతికి కేరాఫ్ అడ్రెస్స్ గా అంధ్రప్రదేశ్ తయారయ్యింది. అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే అవినీతి తిమింగలాలు అనే విధంగా తయారయ్యారు. ఈ మధ్య కాలంలో అవినీతి నిరోధక శాఖ చేస్తున్న దాడుల్లో వరుసగా ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి భాగోతాలు బయటపడుతున్నాయి. తాజాగా అలాంటి అవినీతి భాగోతం ఏపీలో బయటపడింది. టౌన్ ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న గొల్ల వెంకట రఘు, అతని బినామీలుగా భావిస్తున్న మరి కొంత మంది మీద అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేసారు. ఈ దాడులలో సుమారు 200 కోట్లు వరకు బీనామీ ఆస్తులని రఘు కూడబెట్టినట్లు అనిశా అధికారులు గుర్తించి విస్తుపోయారు. ఒక టౌన్ ప్లానింగ్ అధికారికి అంత మొత్తంలో సంపాదన అంటే ఎలా వచ్చి ఉంటుందో అందరికి తెలిసిందే. ఇక రఘు భార్య గతంలో విజయవాడ మున్సిపాల్ కార్పోరేషన్లో ఉద్యోగం చేసేది. వీళ్ళు ఎ స్థాయిలో అవినీతి అక్రమాలకి పాల్పడ్డారు అనేది ఇప్పుడు అనిశా అధికారుల తనిఖీలో బయట పడిన వారి ఆస్తులే చెబుతున్నాయి.

అయితే ఇంత పెద్ద స్థాయిలో అవినీతి అక్రమాలు బయటపడుతున్న, తరువాత ఆ కేసులకి సంబంధించి విచారణ ఎంత వరకు జరుగుతుంది అనేది ఎవరికీ తెలియని ప్రశ్న. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది ఇంజినీర్ లని, రెవెన్యూ అధికారులని అనిశా అధికారులు పట్టుకున్నారు. భారీగా వారి అక్రమ ఆస్తులని కూడా గుర్తించారు. అయితే అలా అనిశా దాడులు చేసినపుడు మాత్రమె ఆ అధికారుల గురించి అందరికి తెలుస్తుంది. తరువాత కేసు విచారణకి వచ్చేసరికి వాటిపై ఎలాంటి చర్యలు ఉన్నాయి అనేది చాలా రహస్యంగా జరుగుతుంది అనేది అందరి మాట. మరి ఇప్పటి వరకు అనిశా దాడుల్లో పట్టుబడిన అవినీతి అధికారుల కేసులు ఏమయ్యాయి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

  •  
  •  
  •  
  •  

Comments