టిఆర్ఎస్ లో చేరనున్న అలనాటి హీరోయిన్.. ఎవరో తెలుసా ..?

Saturday, September 24th, 2016, 03:20:06 PM IST

sangeetha
బాపు గీసిన బొమ్మ అయినా, ఆయన చూపించిన హీరోయిన్ అయినా మరచిపోవడం కష్టం.అంత అందంగా చూపిస్తారు.ఇప్పుడు ఇదంతా ఎందుకంటే బాపు దర్శకత్వంలో నటించిన అలనాటి హీరోయిన్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న నటి టిఆర్ఎస్ లో చేరబోతోందంటూ వార్తలు వస్తున్నాయి.

ఆమె ఎవరోకాదు బాపు చిత్రాల్లో ఆణిముత్యం అయిన ముత్యాలముగ్గు చిత్రంలో హీరోయిన్ గా నటించిన సంగీత. ప్రస్తుతం ఈమె టిఆర్ ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతోందంటూ వార్తలు వస్తున్నాయి.ఈమె అన్ని భాషల్లో దాదాపు 600 చిత్రాలలో నటించింది.తెలుగులో దాదాపు 200 చిత్రాలకు పైగానే నటించింది.ఆమె టిఆర్ ఎస్ తరపున సినిమా రంగ సంభందిత పదవులను ఆశిస్తున్నట్లు సమాచారం. ఈమె వరంగల్ జిల్లా వాసి.

  •  
  •  
  •  
  •  

Comments