మళ్ళీ మొదలైన ఆపరేషన్ “గరుడ”..?

Sunday, September 9th, 2018, 02:00:28 AM IST

గత కొద్ది నెలల క్రితం నటుడు శివాజీ ఆపరేషన్ “గరుడ” అంటూ ఒక 20 నిమిషాల నిడివి ఉన్న వీడియో పెట్టి రాజకీయాల్లో ఒక చిన్న పాటి దుమారాన్నే లేపాడు అని చెప్పాలి. ఎందుకంటే ఆ వీడియోలో పార్టీల పేర్లు వాటి నాయకుల యొక్క పేర్లు చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద స్థాయిలో కుట్ర జరుగుతుంది అని, దాన్ని అడ్డుకోడం ఎవరి తరము కాదని భవిష్యత్తులో ఈ సంఘటనలు కచ్చితంగా జరుగుతాయి అని చెప్పాడు కానీ ఆ తర్వాత సీన్ అంతా మారిపోయింది..

ఆయన అందులో చెప్పినట్టు ఏది జరగకపోగా రాజకీయ నాయకుల చేతుల్లో నటుడు శివాజీ నవ్వులపాలు అయ్యాడు. ఐతే మళ్ళీ శివాజీ ఈ ఆపరేషన్ గరుడ పురాణాన్ని మళ్ళీ మొదలు పెట్టాడు. ఇందులో భాగంగా పత్రికా మిత్రులతో మాట్లాడుతూ ఈ సారి జరగబోయేది ఆపరేషన్ గరుడ వేరే రూపంలో రాబోతున్నది అని నిన్న రాత్రే తనకి ఒక కాల్ వచ్చింది అని అందులో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని లక్ష్యం గా పెట్టుకొని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని. ఇదంతా తనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం అని, బాబు స్థానం లో జగన్ ఉన్న సరే తాను ఇలాగే ఆందోళన చేపట్టేవాడిని అని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల నుంచి చంద్రబాబుని తొలగించడానికి కేంద్రప్రభుత్వం పంజా విసరబోతుంది అని ప్రజలను పక్కన పెట్టి మీ స్వార్ధ రాజకీయాల కోసం ఆటలు ఆడుకుంటున్నారు అని.

భావితరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒకవేళ ఇవ్వకపోతే వారి యొక్క భవిష్యత్తు ఏమిటి అని ప్రశ్నించారు, ఇచ్చిన మాట నిలబెట్టుకొని వాళ్ళు రేపు రాష్ట్రానికి వచ్చి ఓట్లు ఎలా అడుగుతారని బీజేపీ పార్టీ మీద మండిపడ్డారు.

  •  
  •  
  •  
  •  

Comments