వీడియో సెంటర్లపై విశాల్ దాడి

Friday, October 31st, 2014, 10:52:45 PM IST

vishal
ప్రముఖ సినినటుడు విశాల్ పోలాచీలోని ఓ వీడియో సెంటర్ పై దాడిచేసి..పూజా పైరసీ సీడీలను స్వాదీనం చేసుకున్నారు. నటుడు విశాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక వివరాలలోకి వెళ్తే..

గత రాత్రి విశాల్ పోలాచీలో షూటింగ్ లో పాల్గొనేందుకు వెళ్లారు. షూటింగ్ అనంతరం విశాల్.. తను నటించిన పూజా మరియు ఇతర సినిమాల పైరసీ సిడిల గురించి అరాతీసేందుకు ఇద్దరు సహాయకులను పంపారు. సహాయకులు అందించిన సమాచారం మేరకు విశాల్ వీడియో వీడియో షాపులో సోదాలు నిర్వహించి పూజా, కత్తి పైరసీ సిడిలను స్వాదీనం చేసుకున్నారు. గతవారం విశాల్ తిర్పూర్ లోని ఓ విడియో షాపుపై కూడా ఇదేవిధంగా సోదాలు నిర్వహించారు. ప్రభుత్వం పైరసీ సిడిల విషయంలో ఎంత కఠిన వైఖరి అవలంభిస్తున్నప్పటికీ.. పైరసీలు జరుగుతూనే ఉన్నాయి.