డబ్బులిచ్చి చెంపదెబ్బ కొట్టించుకున్న నటి!

Monday, January 5th, 2015, 11:21:16 AM IST

gouhar-khan

ప్రముఖ బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్ ను పొట్టి దుస్తులతో వస్తావా అంటూ ఒక వ్యక్తి ఇటీవల పబ్లిక్ గా చెంపలు వాయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదంలో ఇప్పుడు కొత్తకోణం తొంగి చూస్తోంది. కాగా అసలు విషయమేమిటంటే తనను పబ్లిక్ గా కొట్టమని గౌహర్ ఖానే సదరు వ్యక్తి డబ్బులు ఇచ్చిందట. ఈ నేపధ్యంగా గౌహర్ ఖాన్ పై దాడి చేసిన మహ్మద్ అఖిల్ మాలిక్ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని వెల్లడించాడట. మాలిక్ చెప్పిన సమాచారం బట్టి తనని పబ్లిక్ గా కొడితే అతనికి నగదుతో పాటు దబాంగ్ 3 చిత్రంలో నటించే అవకాశాన్ని కూడా ఇస్తానని గౌహర్ ఖాన్ చెప్పిందట. ఇక సంఘటనకు మూడు రోజుల ముందే గౌహర్ ను కలిశానని మాలిక్ చెప్తున్నాడు. అయితే గౌహర్ ఖాన్ మాత్రం ఈ ఆరోపణలను ట్విట్టర్లో కొట్టిపారేసింది. ఇక ఇదంతా చూస్తుంటే పబ్లిసిటీ కోసం తారలు దేనికైనా వెనకాడరని తెలుస్తోంది కదూ!