పబ్లిసిటీ కోసం పరువు తీస్తే తోలు తీస్తాం.!

Sunday, April 22nd, 2018, 05:33:05 PM IST

తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ను తరిమికొట్టే ప్రయత్నంలో బాధితులకు అండగా ఉంటామని సినీనటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. 1991 నుంచి ఇండస్ట్రీలో ఉన్నానని… అప్పటి నుంచి ఇప్పటిదాకా కాస్టింగ్ కౌచ్ పై ఎవరూ ఫిర్యాదు చేయాలేదని… ఇకపై ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తినా నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.

పబ్లిసిటీ కోసం ఎవరైనా సరే ఇండస్ట్రీ పరువు తీయాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయకూడదని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం సినీ పరిశ్రమ కూడా పోరాడుతుందని చెప్పారు. టీటీడీ పాలకమండలిలో నియామకాలు హిందువుల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయని అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments