జర్సీ సినిమాలో హాట్ బ్యూటీ…!

Sunday, February 10th, 2019, 10:50:02 PM IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జర్సీ, ఈ సినిమా కథ క్రికెట్ నేపథ్యంలో ఉంటుందనేది తెలిసిన విషయమే. ఈ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతోంది, నాని కెరీర్లోనే హైయెస్ట్ ప్రీ – రిలీజ్ బిజినెస్ జరిగింది ఈ సినిమాకు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి, సూర్యదేవర నాగ వంశీ నిర్మాణంలో అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది, ఈ సినిమాలో ఓ స్పెషల్ ఉండబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి.

జర్సీ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం దర్శక నిర్మాతలు హార్ట్ అటాక్ బ్యూటీ అదా శర్మను సంప్రదించినట్లు సమాచారం, ఈ మేరకు ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. నిత్యం సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలతో నిద్రపట్టకుండా చేస్తున్న ఈ బ్యూటీ సినిమాలో స్పెషల్ సాంగ్ అంటే ఇంకెంత రెచ్చిపోతుందో చూడాలి. ఏది ఏమైనా అదా శర్మ స్పెషల్ సాంగ్ జర్సీ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనుంది.