ఇతర పార్టీ నాయకుల్లా భయపెట్టే పార్టీ కాదు జనసేన పార్టీ..!

Monday, September 24th, 2018, 02:42:38 PM IST

చాలా కాలం విరామం తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రజల్లోకి రాబోతున్నారు.నిన్న నెల్లూరులో జరిగిన రొట్టెల పండుగ నిమిత్తం జనసేనాని తన స్నేహితుడు అలీతో వచ్చి రొట్టెలను వదిలిన సంగతి కూడా తెలిసినదే.ఈయన తన పనులను కాస్త విరమించినా కానీ గ్రామ స్థాయిల్లో మాత్రం వీరి పార్టీ నిర్మాణ పనులు మాత్రం ఆగటం లేదు.ఎప్పటికప్పుడు ప్రతీ గ్రామంలోకి వెళ్లి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ అక్కడ జనసేన జెండా ఎగురవేస్తున్నారు జనసేన పార్టీ నాయకులు.

అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా పాతకోట అనే గ్రామంలో కూడా జనసేన జెండా ఆవిష్కరణకు వారి పార్టీ ముఖ్య సభ్యుల్లో ఒకరు అద్దెపల్లి శ్రీధర్ గారు కూడా పాల్గొన్నారు,వారు ఈ సభలో మాట్లాడుతూ జనసేన పార్టీకంటూ ఒక ఎజెండా ఉందని చంద్రబాబు నాయుడు గారిలా వారి మామ దగ్గర దోచుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు, అంతే కాకుండా జెండా ఆవిష్కరణ అనంతరం జనసేన పార్టీ జనసేన జెండా ఎక్కడికైనా వచ్చిందంటే అక్కడి ప్రాంత ప్రజలకు వారి పార్టీ ఎల్లవేళలా భరోసాగా ఉన్నట్టే అని అంతేకాని ఇతర పార్టీలలోని నాయకులిలా ప్రజలను భయపెట్టే పార్టీ జనసేన పార్టీ కాదని వారి భయాన్ని పోగొట్టే పార్టీ అని పేర్కొన్నారు,ప్రభుత్వాలు ఇచ్చినట్టువంటి అబద్ధపు హామీలను ఉద్దేశించి జనసేన పార్టీ ప్రజల తరపున ఎల్లప్పుడూ పోరాడుతుందని తెలిపారు.