రివ్యూ : ‘అదుగో’ – నిరుత్సాహ పరిచిన బంటి !

Wednesday, November 7th, 2018, 03:47:50 PM IST

దర్శకడు రవిబాబు తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం ‘అదుగో’. అభిషేక్ వర్మ, నాభ నటేష్ జంటగా నటించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ..

కథ :

బంటి (పందిపిల్ల) ఒక తప్పుడు కొరియర్ ద్వారా హీరో (అభిషేక్ వర్మ) దగ్గరకి చేరుతుంది. అది పంది పిల్ల అని తెలియక, అభిషేక్ వర్మ దాన్ని తన లవర్ నాభా నటేష్ కి ప్రెజెంట్ చేస్తాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య.. బంటి, సిక్స్ ప్యాక్ శంకర్ (రవిబాబు)కు మరియు మరికొన్ని గ్యాంగ్ లకు అత్యవసరంగా కావాల్సి వస్తోంది.

దాంతో సిక్స్ ప్యాక్ శంకర్ తో సహా మిగిలిన గ్యాంగ్ లందరూ బంటిని పట్టుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాల్లో బంటికి ఎలాంటి సమస్యలు వచ్చాయి ? ఆ గ్యాంగ్ లు నుండి బంటి ఎలా తప్పించుకుంది ? చివరకి తనని పెంచుకున్న పిల్లాడి దగ్గరకి బంటి ఎలా చేరింది ? ఈ క్రమంలో హీరోకి వచ్చిన సమస్యలు ఏమిటి ? ఫైనల్ గా హీరో తన లవర్ ని దక్కించుకున్నాడా ? లేదా ? లాంటి విషయాలు తెలయాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

విశ్లేషణ :

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన బంటి (పంది పిల్ల) సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్యాంగ్ లు నుంచి తప్పించుకున్నే సన్నివేశాల్లో.. బంటి బాగా అలరిస్తోంది. ఇక హీరోగా నటించిన అభిషేక్ వర్మ హీరో మెటీరియల్ కాకపోయినా, చాలా చక్కగా కాన్ఫిడెంట్ గా నటించాడు. హీరోయిన్ గా నాభ నటేష్ తన నటనతో పాటు తన గ్లామర్ తోనూ ఆకట్టుకుంది. కథలో కీలక పాత్ర అయిన సిక్స్ ప్యాక్ శక్తిగా నటించిన రవిబాబు తన కామెడీ టైమింగ్‌ తో అక్కడక్కడా నవ్విస్తూనే.. ఇటు మర్డర్స్ చేస్తూ.. కథలో సీరియస్ నెస్ తీసుకొచ్చారు. బంటిని పెంచుకున్నే పిల్లాడి పాత్రలో నటించిన అబ్బాయి కూడా చాలా బాగా నటించాడు. బంటి కోసం ఆ పిల్లాడు పడే బాధ.. ఆ పిల్లాడి కోసం బంటి పడే తపన ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. కాకపొతే సినిమాలో చాలా క్యారెక్టర్స్ చాలా ప్లాట్ పాయింట్స్ ఉండటంతో.. దేనికి న్యాయం జరగలేదు. చాలా సన్నివేశాల్లో దర్శకుడు తనకు తోచినట్లు రాసుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోయాడా అనిపిస్తోంది. పైగా ప్లో లేని సీన్లతో, అలరించలేని కామెడీతో సినిమా నిరుత్సాహ పరుస్తోంది. పైగా వర్కౌట్ అవ్వని మిస్ అండర్ స్టాడింగ్ కామెడీతో, కన్విన్స్ కానీ, లాజిక్ లేని సీన్స్ తో నవ్వించడానికి శతవిధాలా దర్శకుడు ప్రయత్నం చేసినప్పటికీ.. ప్రేక్షకులు మాత్రం మనస్ఫూర్తిగా నాలుగుసార్లు కూడా నవ్వుకోరు. ఓవరాల్ గా సినిమాలోని చాలా సన్నివేశాలు మరీ నాటకీయంగా గందరగోళంగా ఉండటంతో ఈ సినిమా మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకోదు.

ప్లస్ పాయింట్స్ :

బంటి సన్నివేశాలు

నాభా నటేష్ నటన

గ్యాంగ్ లకి బంటికి మధ్య జరిగే ఫైట్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

ఆకట్టుకోలేని కథ కథనాలు,

పండని మిస్ అండర్ స్టాడింగ్ కామెడీ

లాజిక్ లేని సీన్స్

తీర్పు :

దర్శకడు రవిబాబు దర్శకత్వంలో అభిషేక్ వర్మ, నాభ నటేష్ జంటగా నటించిన ఈ చిత్రం ఆకట్టుకున్నే విధంగా లేదు. బంటి సన్నివేశాలు కొన్ని పర్వాలేదనిపించినప్పటికీ… కన్వీన్స్ కానీ ట్రీట్మెంట్ మరియు గ్యాంగ్ లు మధ్య పండని మిస్ అండర్ స్టాడింగ్ కామెడీ, అలాగే లాజిక్ లేని సీన్స్ తో ఆసక్తికరంగా సాగని కథనం లాంటి కొన్ని అంశాలు కారణంగా ఈ సినిమా ఫలితం దెబ్బ తింది. ఓవరాల్ గా సినిమాలోని చాలా సన్నివేశాలు మరీ నాటకీయంగా గందరగోళంగా ఉండటంతో ఈ సినిమా మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకోదు.

Rating : 1.5/5