వ‌న్నెచిన్నెల అదితీ వావ్‌!!

Thursday, December 6th, 2018, 01:39:47 AM IST

`ప‌ద్మావ‌త్‌` రిలీజ్ త‌ర్వాత హైద‌రాబాదీ అంద‌గ‌త్తె అదితీరావ్ హైద‌రీ పాపులారిటీ అసాధార‌ణంగా పెరిగిన సంగ‌తి తెలిసిందే. ఖిల్జీ మోహించిన రాకుమారిగా అదితీ కిక్కిచ్చింది. ఆ త‌ర్వాత తెలుగులో వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తూ మ‌న యూత్‌లో వేడి పెంచింది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అగ్ర‌హీరోల స‌ర‌స‌న న‌టించేందుకు ఉవ్విళ్లూరుతోంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ టాలీవుడ్ అగ్ర‌హీరోలెవ‌రూ పిలిచి అవ‌కాశాలివ్వ‌లేదు. ఇటీవ‌లే మ‌ణిర‌త్నం -న‌వాబ్ చిత్రంలో అదితీ న‌ట‌నాభిన‌యానికి యూత్ ఫిదా అయిపోయింది. ఈ ఊపులోనే ఈ భామ సౌత్‌లో మ‌రిన్ని క్రేజీ ఆఫ‌ర్స్ కోసం ప్ర‌య‌త్నిస్తోంద‌ట‌.

తాజాగా వావ్ హైద‌రాబాద్ క‌వ‌ర్‌పేజీపై అదితీ త‌ళుక్కుమ‌ది. ట్రెడిష‌న‌ల్ లుక్‌లో క‌నిపించినా వేడెక్కించే అందాల ఎలివేష‌న్‌తో ఆక‌ట్టుకుంది అదితీ. అదితీ ఈ హుషారులోనే రెహ‌మాన్ మేన‌ల్లుడు జీవీ ప్ర‌కాష్ కుమార్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రంలో ఓ పాట కూడా పాడేసిందిట‌. ఆ విష‌యాన్ని సామాజిక మాధ్య‌మాల ద్వారా వెల్ల‌డించింది. త‌మిళంలో త‌న‌కు ఉన్న నెట్‌వ‌ర్క్ ద్వారా అక్క‌డ స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాల కోసం ప్ర‌యత్నిస్తోంద‌ని స‌మాచారం.