ఢిల్లీ తర్వాత విజయవాడే తొలి స్మార్ట్‌సిటీ

Monday, September 15th, 2014, 04:24:52 PM IST


ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్టే కనిపిస్తోంది.ఢిల్లీ తర్వాత దేశంలో తొలి స్మార్ట్‌సిటీగా విజయవాడనే ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడలో జరిగిన స్మార్ట్‌ సిటీ అవగాహన సదస్సులో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఈ విషయం వెల్లడించారు. దేశంలో 100 స్మార్ట్‌సిటీల నిర్మాణం ప్రధాని మోడీ కల అని తెలిపారు. దేశంలో 32 శాతం మందే పట్టణాల్లో నివసిస్తున్నారని, 2050 నాటికి 50 శాతం మంది పట్టణాల్లో నివసిస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

విజయవాడలాంటి నగరాల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని, మనం ఎక్కడ ఉన్నామో అర్థం చేసుకోవాలన్నారు. పన్నుల వసూలుతోనే పనులు జరుగుతాయని, నిధులు లేకుండా పనులు జరగవని అభిప్రాయపడ్డారు. ప్రజల ఆలోచనలో మార్పురాకపోతే పట్టణాలు మురికి కూపాలుగా మారతాయని వెంకయ్య తెలిపారు. ఏపీ మంత్రులు ఆచరణ సాధ్యమైన హామీలే ఇవ్వాలని వెంకయ్య సూచించారు.