మానవాళి మొత్తం అంతరించిపోతుంది కాని ఆ ఒక్కటి తప్ప?

Sunday, July 16th, 2017, 10:11:51 AM IST

మన సౌర వ్యవస్థలో పరిణామక్రియల్లో భాగంగా భూమిపై జీవ మనుగడ మొత్తం అంతరించిపోయే సమయం ఎంతో దూరంలో లేదు. దానికి ఇక ఏళ్ళు లెక్కపెట్టుకోవాల్సిందే. ప్రకృతి మాటున మనిషి సృష్టిస్తున్న వినాశనంతో తన మనుగడ కనుమరుగు అయ్యే పరిస్థితి వస్తుందని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. అయితే ఏదో ఒక సందర్భంలో జీవ మనుగడ నాశనం కావడం ఖాయం. అయితే జీవ మనుగడ పూర్తిగా నాశనం అయిన నీటి ఎలుగుబంటిగా వ్యవహరించే టార్డిగ్రేడ్ల ప్రస్థానం మాత్రం సూర్యుడు అంతమయ్యేవరకూ కొనసాగుతుందని తాజాగా తేల్చారు. మరో వెయ్యి కోట్ల ఏళ్ల వరకూ వీటికి ఢోకా లేదు. వీటిని సమూలంగా నిర్మూలించే పరిణామమేదీ జరిగే అవకాశం లేదని గుర్తించారు. భూమి మీద ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడే జీవిగా బొద్దింకకు పేరు ఉంది. అయితే టార్డిగ్రేడ్‌లు వీటి కన్నా దృఢమైనవని ఆక్స్‌ఫర్డ్‌, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయల శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. నీటిలో జీవించే ఈ 8 కాళ్ల వింత జీవులు గరిష్ఠంగా అర మిల్లీమీటరు మాత్రమే పెరగగలవు. ఆహారం, నీరు లేకుండా ఏకంగా 30 ఏళ్ల పాటు జీవించగలవు. 150 డిగ్రీల సెల్సియస్‌ వేడిని కూడా తట్టుకోగలవు. సముద్రగర్భలోని కఠిన పరిస్థితులు; అంతరిక్షంలోని శీతల, శూన్య వాతావరణాన్ని ఇవి తట్టుకొని నిలబడగలవు. మానవుడికి ప్రమాదకరంగా పరిణమించే స్థాయి కన్నా వందల రెట్లు ఎక్కువ మోతాదులో రేడియోధార్మికతను చాలా తేలిగ్గా తట్టుకుంటాయి. సగటున 60 ఏళ్ల వరకూ జీవిస్తాయి. షో. మనిషి నాశనం అయిన జీవ మనుగడలో ఆఖరి జీవి బ్రతికే ఉంటుంది. ఏమో. మరల ఆ జీవి నుంచి జీవ పరిణామ క్రమం మొదలవుతుందేమో చూడాలి.