బ్రేకింగ్: వైసీపీ గెలిచాక జగన్‌తో కలిసి ప్రమాణ స్వీకారం చేసేది వీరేనట..!

Monday, April 22nd, 2019, 11:00:09 AM IST

ఏపీలో మొన్న సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. అయితే ఫ‌లితాలకు మాత్రం ఇంకా సమయం ఉంది. ఎక్కడైనా ఫలితాలు వెలువడినాక ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో చెప్పవచ్చు. కానీ ఏపిలో మాత్రం అన్ని సర్వేలు ఫలితాలు రాకముందే సీఎం ఎవరో చేప్పేస్తున్నాయి. వాటిని నమ్ముకుని వైసీపీ ఫలితాలు వెలువ‌డ‌క ముందే సీఎంలుగా పేరు పెట్టేసుకొని నెంబ‌ర్ ప్లేట్ లు కూడా త‌యారు చేయించుకుంటున్నారు. ఇదంతా పక్కనపెడితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎవరితో కలిసి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో కూడా నిర్ణయించుకున్నారట.

అయితే ఏపీలో ఇప్పటికే జగన్ గెలుపు ఖాయమని వైసీపీ నేతలు ధీమాతో ఉన్నారు. ఈ త‌రుణంలో కొంత మంది నేతలు జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్లి త‌మ‌కు మంత్రి ప‌ద‌వి కావాల‌ని అయ‌న‌ను అడిగిన‌ట్లు తెలుస్తుంది. అయితే దీనిపై సానుకూలంగా స్పందించిన జ‌గ‌న్ వారికి హామి ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. మే 23న ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత జ‌గ‌న్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న‌ప్పుడు ఆయ‌న‌తో పాటు బాలినేని శ్రీనివాస రెడ్డి, అంజాద్ భాషా, మోపిదేవి వెంకటరమణ, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా, కొడాలి నాని, బాలనాగిరెడ్డి, ధర్మాన ప్రసాదరావులకు బెర్తులు ఖరారు అయినట్టుగా సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ప్రమాణ స్వీకారం రోజున వైఎస్ జగన్ తో కలిసి మొత్తం తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా ముందు ముందే అన్ని ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్న వైసీపీకీ ఫలితాలు అనుకూలంగా ఉంటాయో లేక వారి అంచనాలు బెడిసి కొడతాయో మే 23న ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.