మరో సారి కేంద్రంపై మండిపడ్డ బాబు..!

Wednesday, September 12th, 2018, 01:02:40 AM IST


ఆంధ్ర రాష్ట్రం లో జరుగుతున్న శాసన సభ మీటింగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరోసారి బీజేపీ పార్టీ మీద మరియు వారి అధినేత నరేంద్ర మోడీ మీద నిప్పులు చెరిగారు. ఇవాళ శాసన సభలో మాట్లాడుతూ కేంద్రంతో కేవలం రాష్ట్రానికి మంచి అభివృద్ధి చేస్తారనే ఉద్దేశం తోనే పొత్తు పెట్టుకున్నాం అని వేరే ఏ ఉద్దేశం లేదు అని అన్నారు. అసెంబ్లీ లో నీరు కారుతుంది చెప్పి గొడుగులు, రైన్ కోటులు వేసుకొస్తారా అంటూ నవ్వుతూనే విమర్శించారు.

మీ లాంటి వాళ్లకి ఒకసారి కృష్ణా నదిలో ముంచి తీస్తే మీలో ఉన్న పాపపు ఆలోచనలు అన్ని పోయి పుణ్యవంతులు అవుతారని తెలిపారు. నరేంద్ర మోడీ రాష్ట్రం పట్ల అబద్దపు హామీలు ఇచ్చారని, ఆంద్ర రాష్ట్రం పట్ల కేంద్రానికి ఎందుకు ఇంత చిన్న చూపు అని తీవ్రంగా మండిపడ్డారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా సరే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీరుతాం అని అందులో ఎలాంటి సందేహం లేదు అని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments