మరో సారి చంద్రబాబుని ఏకి పారేసిన కేసీఆర్..!

Friday, September 7th, 2018, 12:39:40 AM IST

తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ సమావేశం రద్దు మరియు ముందస్తు ఎన్నికల విషయం లో ఒక క్లారిటీని ఇవ్వడానికి పెట్టిన ప్రెస్ మీట్ లో ఒక విలేఖరి చంద్రబాబు నాయుడు కోసం అడిగిన ప్రశ్నకి సి ఎం కే సి ఆర్ దిమ్మ తిరిగిపోయే సమాధారం ఇచ్చారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రోజు తెలంగాణా రాష్ట్ర సి ఎం వారి మంత్రులు అందరితో కలిసి ముందస్తు ఎన్నికల కోసం మరియు అసెంబ్లీ రద్దు చేస్తున్నాం అని అధికారికంగా ప్రకటన ఇవ్వడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టారు.

ఆ ప్రెస్ మీట్ లో చంద్ర బాబు నాయుడు గారి ప్రభావం ఎలా ఉండబోతుంది అని అడగగా వ్యంగంగా ఆ తెలుగుదేశం పార్టీ ఉన్న లేకపోయినా ఒకటే అని, ఎప్పుడు, ఏ చోట సర్వేలు చేయించినా, 0.1 లు 0.2 లు అంతకు మించి ఏం రావడం లేదు అని పొద్దున్న లేస్తే నా మీద అబాండాలు వేసే చంద్రబాబు నాయుడు, గోదావరి ప్రాజెక్ట్ అంటాడు కృష్ణా ప్రాజెక్ట్ అంటాడు. అని ఎద్దేవా చేశారు, ఇప్పుడేమో కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పొత్తు అంటున్నారు అని ఇది చాలా సిగ్గు చేటు అని ఇది గులాం గిరి చేసినట్టు అవుతుందని ఆ తప్పు మళ్ళీ తెలంగాణా చెయ్యబోదు అని కాంగ్రెస్ మరియు చంద్రబాబు నాయుడులని ఒక ఆట ఆడుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments