పెట్రోలు ధరలు తగ్గించండి మొర్రో.. నై నై ఇంకా పెంచుతాం..

Monday, September 10th, 2018, 03:05:17 PM IST

ఒక పక్క భారత దేశం మరియు ఆంధ్ర రాష్ట్రాల్లో చమురు ధరలు తగ్గించండి మొర్రో అని ప్రజలు నాయకులు గొంతు చించుకొని గగ్గోలు పెడుతుంటే కేంద్ర ప్రభుత్వం వారికేమి పట్టనట్టుగా పెట్రోలు రేట్లపై మళ్ళీ బాదుడు మొదలు పెట్టింది.

ముంబై లో అత్యధికంగా లీటర్ పెట్రోలు ధర 90 రూపాయలకు చేరుకుంది. డీజెలు అత్యధికం గా 77 రూపాయల 32 పైసలకు చేరుకుంది. హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర 85 రూపాయల 60పైసలకు చేరుకుంది, లీటరు డీజెలు ధర 79 రూపాయల 22 పైసలకు పెరిగింది. పెరుతున్న పెట్రోలు ధరలు తగ్గించండి మహా ప్రభో అంటే వారికి ఏ విధంగా వినిపించిందో మరి లేక వేరే ఇతర ఏ కారణాల వాళ్ళ ఇంత ఎక్కువగా రేట్లు పెంచుతున్నారో వాళ్లకే తెలియాలి.. ఈ విధంగా పెరుగుతున్న ధరల నిమిత్తం ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి..

  •  
  •  
  •  
  •  

Comments