మరోసారి తలపడనున్న భారత్-పాకిస్తాన్.!ఈ సారైన రసవత్తరంగా ఉంటుందా?

Saturday, September 22nd, 2018, 04:08:10 PM IST


ఆసియ కప్ మ్యాచుల్లో భారత్ జట్టు తిరుగు లేకుండా దూసుకెళ్లిపోతుంది.మొదటి మ్యాచ్ లో హాంగ్ కాంగ్ జట్టు ఇచ్చిన జలక్ తో కాస్త తడబడినా మరీ అలవోకగా కాకపోయినా కొంచెం కష్టం గానే గెలిచింది అని చెప్పుకోవాలి.ఐతే ఆ తర్వాతి మ్యాచుల్లో మాత్రం అలంటి తడబాట్లు ఏమి చెయ్యలేదు.నిన్న జరిగిన బంగ్లాదేశ్ తోను మొన్న జరిగిన పాకిస్థాన్ తోను భారత్ అలవోకగా గెలిచేసింది.

ఐతే ముందు జరిగిన భారత్ పాకిస్థాన్ మ్యాచ్ మాత్రం అంత రసవత్తరంగా లేదు అని భారత్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ భారత్ బౌలర్ల దెబ్బకు కుప్పకూలిపోయారు,వారు లక్ష్యం కాస్త ఎక్కువగా ఇచ్చినా బాగుణ్ణు అని అనుకున్నారు,తక్కువ లక్ష్యం కావడంతో మన బ్యాట్సమెన్ లు సులభంగా కొట్టేశారు,దీనితో హోరాహోరీగా ఉంటుందనుకున్న మ్యాచ్ కాస్త వన్ సైడ్ అయ్యిపోయింది.ఈ సారి మ్యాచులో అయినా ఇరు జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా ఉండాలని ప్రతీ భారత్ పాకిస్థాన్ అభిమాని అనుకుంటున్నాడు.