మళ్ళీ తెర మీదకు ఓటుకి నోటు కేసు..?

Monday, October 1st, 2018, 11:01:50 AM IST

ఒక పక్క తాను ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉంటే మరో పక్క అకస్మాత్తుగా తన ఇంట్లో ఐటీ దాడులు అంతే తెలంగాణా రాష్ట్రంలోని ఎన్నికల వేడి ఒక్క సారిగా ఇంకా ఊపందుకుంది.రేవంత్ రెడ్డి మీద ఐటీ దాడులు అనగానే కాంగ్రెస్ నాయకులు, రేవంత్ రెడ్డి ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యి తెరాస పార్టీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసినదే.ఒక పక్క తెలంగాణా నాయకులు మరో పక్క రేవంత్ రెడ్డి ఒక్క లెక్కలో ఒకరి మీద ఒకరు కాస్త దుర్భాషలకు కూడా పాలపడ్డారు.ఇప్పుడు ఈ కేసు మరో కొత్త మలుపు తిరగనున్నట్టు సమాచారం.

కొన్ని సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు అనే కేసు ఎంత సంచలనానికి దారి తీసిందో అందరికి తెలుసు.ఆ కేసుకి సంబంధించి కొన్ని ఆడియో సాక్ష్యాలు,వీడియో టేపులు కూడా బయట పడ్డాయి,ఆ వీడియోలో ప్రధాన నిందితునిగా రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడన్న సంగతి కూడా తెలిసినదే.ఐతే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు జరిగిన ఐటీ దాడుల నిమిత్తం రేవంత్ రెడ్డిని ఐటీ అధికారులు ఎన్నో ప్రశ్నలు సంధించారు,మరి కొన్ని రోజుల్లో రేవంత్ రెడ్డిని విచారణకు కూడా హాజరు కావాలని కూడా ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది,ఆ విచారణలో ఓటుకు నోటు కేసు ప్రస్తావన కూడా ఉందని,ఆ వీడియోలో తనకి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని,ప్రశ్నించే అవకాశం ఉంది అన్నట్టుగా సమాచారం.