అజ్ఞాతవాసి బయ్యర్స్ కి గుడ్ న్యూస్

Thursday, February 1st, 2018, 11:20:49 PM IST

ఎన్ని అంచనాల నడుమ విడుదలైన అజ్ఞాతవాసి సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. బయ్యర్స్ కి ఈ సినిమా దాదాపు 60% వరకు నష్టాలను మిగిల్చింది. సినిమా మొత్తంగా రూ.110 కోట్ల వరకు అమ్ముడు పోయింది. అయితే నిర్మాత రాధాకృష్ణ రీసెంట్ గా ఒక నిర్ణయానికి వచ్చాడట. బయ్యర్స్ ని కొంచెం అయినా ఆదుకోవాలని 60% నష్టాలను చూసిన వారికి 19% వరకు ఇవ్వాలని చూస్తున్నాడట. మొత్తంగా రూ.20.9 కోట్లను బయ్యర్స్ కి ఇవ్వనున్నారట. 19% అంటే వారికీ పెద్దగా నష్టాలను తీర్చకపోవచ్చు కానీ కొంతలో కొంత అయినా హెల్ప్ చేయాలనీ రాధాకృష్ణ డిసైడ్ అయ్యారట రాధా కృష్ణకు కూడా ఈ సినిమా వల్ల నష్టాలను చూడక తప్పడం లేదు. ఇక త్రివిక్రమ్ కూడా రెమ్యునరేషన్ లో కొంత తీరిగి ఇస్తున్నాడని తెలుస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నెక్స్ట్ సినిమాతో బయ్యర్స్ నష్టాలను రికవర్ చేయాలనీ అనుకుంటున్నాడని కొన్ని మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా నిర్దారణ కాలేదు.