సాగు నీరు ఇస్తారా.? లేక పురుగుల మందు తాగమంటారా? ఆవేదనతో రైతులు

Wednesday, September 12th, 2018, 04:19:23 PM IST

మన అందరికి అన్నం పెట్టె రైతుకే ఇప్పుడు నీటికి కరువొచ్చింది. మాకు పంట పండించుకోడానికి నీరు ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేసుకుంటాం అని కర్నూలు జిల్లాకి చెందిన కోడుమూరు ప్రాంతానికి చెందిన రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.వారికి సాగు నీరు ఇచ్చే వరకు తాము కదలము అని చెప్పి కర్నూలు బళ్లారి నడుమ రహదారిలో వెళ్లే వాహనాలు అన్నిటిని ఆపి బైఠాయించారు.

ఇది వరకు కొన్ని నెలల వరకు వారికి పంటలు పండించుకోడానికి సాగునీరు వచ్చేదని, ఐతే గత కొద్ది నెలలు నుంచి వారికి నీటి పారుదల ఆపేసారాని, దీనిపై ఆ జిల్లాకి సంబందించిన కలెక్టర్ కి,డీఈ కి ఎన్ని సార్లు చెప్పినా, ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా సరే వారు తమ గోడు పట్టించుకోట్లేదు అని వాపోయారు. ఇక వారు చేసేది ఏమి లేక ఇలా రోడ్డు మీదకి వచ్చి తమ నిరసనను తెలుపుతున్నాం అని మాకు గాని పంటలు పండించుకోడానికి సాగు నీరు ఇవ్వకపోతే ఆ పంటలకు వాడే పురుగుల మందునే తాగి ఆత్మహత్య చేసుకుంటాం అని హెచ్చరించారు. వీరికి అండగా కాంగ్రెస్ మరియు ఇతర వామ పక్షాలు న్యాయం జరిగే వరకు పోరాడుతాం అని భరోసా ఇస్తున్నారు. అన్నం పండించే రైతు పట్ల అధికారుల నిర్లక్ష్యానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు, ఎవరి పనిని వారు భాద్యతగా నిర్వర్తించాలి. అని అందరు గుర్తుంచుకోవాలి.

  •  
  •  
  •  
  •  

Comments