ఆ నటుడికి క్యాన్సరా?

Saturday, December 20th, 2014, 08:29:18 PM IST

Ahuti-Prasad
ప్రముఖ టాలీవుడ్ క్యారెక్టర్ నటుడు ఆహుతి ప్రసాద్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం తెలియవస్తోంది. కాగా ఇటీవల ఆయన ఆరోగ్యం దెబ్బతిని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో ఆయనకు క్యాన్సర్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఆయన కుటుంబ సభ్యులు దీనిపై పెదవి విప్పకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతున్నట్లు అవుతోంది.

ఇక ఆహుతి ప్రసాద్ సొంత ఊరు కృష్ణాజిల్లాలోని ముదినేపల్లి పక్కన ఉన్న కోడూరు. ఆయన అసలు పేరు జనార్ధన వరప్రసాద్. అయితే 1986లో ‘విక్రమ్’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ప్రసాద్ కు ‘ఆహుతి’ సినిమా బ్రేక్ ఇచ్చింది. కాగా ‘చందమామ’ సినిమాకు గాను ఆయన బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నందితో పాటు గుమ్మడి అవార్డు కూడా అందుకున్నారు. అంతేగాక గులాబీ, నిన్నే పెళ్ళాడతా, కొత్తబంగారులోకం, బెండు అప్పారావు, సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం తదితర చిత్రాల్లో ఆహుతి ప్రసాద్ మంచి పాత్రలను పోషించారు.