మాహారాజును కాస్త బిచ్చగాడిని చేసారు…

Thursday, March 29th, 2018, 11:26:05 PM IST

యూపీఏ సర్కారు ‘మహారాజా’ (ఎయిరిండియా)ను బికారీ బిచ్చగాడిగా మార్చిందని పౌర విమానయాన మంత్రి జయంత్‌ సిన్హా విమర్శలు వ్యక్తం చేసారు. మహారాజాకు మళ్లీ పూర్వవైభవం తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పూరాడుతుందని, అందులో భాగంగానే ఎయిరిండియా నుంచి పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టిందన్న విషయాన్ని వెల్లడించారు. ఎయిరిండియాను మళ్లీ లాభాల కొలువు మీరు చూస్తారన్నారు దానికి కావాల్సిన అన్ని ప్రక్రియలు ఇప్పటికే సిద్దం చేస్తున్నాం అన్నారు. ఎయిరిండియాను మళ్ళీ లాభాల పట్టిస్తామన్నారు. ఎయిరిండియాలో 76 శాతం వాటాలను విక్రయిస్తామని తెలిపారు. ఎయిరిండియా సంస్థకు ‘మహారాజా’ లోగో ఉన్న సంగతి తెలిసిందే. ఇకనుంచి ఈ సంస్థ నిర్వహణ, నియంత్రణ వ్యవస్థ ప్రైవేటు సంస్థ చేతిలో ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సంస్థ ఉద్యోగులే పెద్ద మొత్తంలో వాటాలను సొంతం చేసుకునే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. తద్వారా సంస్థ పురోగతి మరింత వేగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో గురువారం జరిగిన వివేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాల్ని ప్రస్తావించారు. ‘మీ తండ్రి యశ్వంత్‌ సిన్హా బుధవారం బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ కలిశారు కదా.. దాని పై మీ స్పందన? అని విలేకరులు అడగ్గా.. అది పూర్తిగా ఆయన సొంత వ్యవహారం. అయినా రాజకీయల్లో భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం సహజం అని బదులిచ్చారు. ఇక ఎయిరిండియాకు పూర్వ వైభవం తీస్కురావడమే తమ ప్రస్తుత ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు.