ఎయిర్ టెల్ కస్టమర్లకు మరో బంపర్ అఫర్

Friday, April 13th, 2018, 04:59:00 PM IST

ప్రస్తుతం టెలికామ్ రంగంలో పోటీ ఏ స్థాయిలో పెరిగిపోయిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎప్పుడైతే జియో వచ్చిందో అప్పటి నుంచి ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఇంటర్నెట్ చార్జీలు భారీగా తగ్గాయి. పైగా టాప్ టెలికామ్ సంస్థలకు దెబ్బ గట్టిగానే తగిలింది. మొదట్లో ఎయిర్ టెల్ కూడా నష్టాలను చూసింది. కానీ ఆ తరువాత పుంజుకొని జియో కి గట్టి పోటీని ఇచ్చింది. జియో ఇచ్చిన ప్రతి అఫర్ కి ఎయిర్ టెల్ కౌంటర్ అఫర్ ఇస్తూనే ఉంది.

పైగా కస్టమర్స్ ని కూడా ఏ మాత్రం తగ్గించుకోలేదు. ఇకపోతే రీసెంట్ గా ఎయిర్ టెల్ మరో బంపర్ అఫర్ ఇచ్చింది. ‘మేరా పెహలా స్మార్ట్‌ఫోన్’ అనే ప్యాకేజ్ ను ప్రకటించింది. ఎవరైతే 2జీ – 3జీ నుంచి 4జీ ఫోన్ కు అప్ గ్రేడ్ అవుతున్నారో వారికి 30జీబీ ఉచిత డేటాను ఇవ్వనుంది. రోజుకి 1 జీబీ చొప్పున 30 రోజుల వరకు ప్రీపెయిడ్ వినియోగ దారులకు ఈ అఫర్ అందనుంది. అఫర్ కోసం 51111 టోల్ ఫ్రీ కి కాల్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి, పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు మాత్రం 30జీబీ ఒకేసారి రానుంది.