జియో కి కౌంటర్ ఇచ్చిన ఎయిర్ టెల్.. అదిరిపోయే ప్లాన్!

Tuesday, May 22nd, 2018, 02:50:40 PM IST

టెలికం రంగంలో ప్రస్తుతం పోటీ ఎలా ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. జియో వచ్చినప్పటి నుంచి అన్ని సంస్థలు కూడా ధరల్లో చాలా మార్పులు తెచ్చాయి. వరుసగా కొన్ని కంపెనీలు అయితే భారీ నష్టాలను చూశాయి. కాని ఎయిర్ టెల్ మాత్రం ఎప్పటికప్పుడు జియో కి గట్టి పోటినిక్ ఇస్తోంది. ఆ సంస్థ ఇచ్చిన ఆఫర్స్ కంటే ఎక్కువ స్థాయిలో కస్టమర్స్ ని ఆకట్టుకునే విధంగా ఆఫర్లను ప్రకటిస్తోంది.

రిలయన్స్ జియో ఇటీవల రూ.498 లో డైలీ అన్ లిమిటెడ్ కాల్స్ – 100 ఫ్రీ మెస్సేజ్ లు అలాగే డైలీ 2 జీబీ డేటా ప్లాన్ ను సెట్ చేసింది. 91 రోజుల వ్యాలిడిటీ. అయితే ఎయిర్ టెల్ కూడా తన కస్టమర్స్ కి బంపర్ ప్లాన్ ని ప్రకటించింది. రూ.558 ప్లాన్ తో జియో కంటే ఒక జీబీ ఎక్కువగా జోడిస్తూ మొత్తం రోజుకి 3 జీబీ డేటాను ప్లాన్ లో యాడ్ చేసింది. 82 రోజుల వ్యాలిడిటీ. ఇక కాల్స్ మెస్సేజెస్ ప్లాన్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతానికి ఢిల్లీలో మాత్రమే ఈ ప్లాన్ అమలైంది. త్వరలోనే దేశ వ్యాప్తంగా ప్లాన్ ను అమలు చేసేందుకు ఎయిర్ టెల్ సన్నాహకాలు చేస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments