‘ఎయిర్ టెల్’ ఎవర్ గ్రీన్ ప్లాన్!

Monday, June 4th, 2018, 09:23:50 AM IST

ప్రస్తుతం టెలికాం రంగంలో పోటీ రోజురోజుకూ అంతకంతకు పెరుగుతోంది. ప్రతి టెలికాం ఆపరేటర్ కస్టమర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు నూతన ప్లాన్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. అందులో మరీ జియో రాకతో ఈ పోటీ మరింత పెరిగింది. ఇప్పటికే జియో పలు చవక ప్లాన్లతో వినియోగదారులను ఆకర్షిస్తుంటే దానికి పోటీగా మిగిలిన ఆపరేటర్లు కూడా ఎప్పటికపుడు నూతన ప్లాన్లను ప్రవేశపెడుతున్నారు. అందులోభాగంగా తాజాగా ఎయిర్ టెల్ నమ్మశక్యం కాని, ఇప్పటివరకు ఇండియా లోని ఏ టెలికాం కంపెనీ ఇవ్వని సౌలబ్యాలు ఈ ప్లాన్ లో అందిస్తోంది. ఇప్పటివరకు ఎయిర్ టెల్ లో రూ.399 రీఛార్జితో 84 రోజుల వ్యాలిడిటీ అలానే రోజు అపరిమిత కాల్స్, 1.4జిబి ఇంటర్నెట్ మరియు రోజుకు 100 ఎస్ఎమ్ఎస్ లు చేసుకునే సదుపాయం ఇస్తోంది. అయితే నిన్న ఆ ప్లాన్ లో అందరిని అబ్బురపరిచే సవరణ ఒకటి తీసుకువచ్చింది.

అదేమిటంటే, ఇప్పటివరకు ఇస్తాన్న 1.4కి బదులు రోజుకు 2.4జిబి చప్పున ఇవ్వడానికి సంస్థ నిర్ణయించింది. ఇటువంటి ఆఫర్ ఇండియా మొత్తంలో ఎయిర్ టెల్ మాత్రమే ఇస్తోంది. కాగా దీని ప్రకారం వినియోగదారుడికి ఒక్క జిబి ఇంటర్నెట్ కేవలం 1.97 పైసలు మాత్రమే పడుతుంది. అయితే ఈ ఆఫర్ ప్రస్తుతానికి కొందరికే అందుబాటులో ఉందని, అతి త్వరలో అందరికి అందుబాటులోకి తీసుకువస్తామని చెపుతున్నారు. అయితే కొందరికేమో 70 వ్యాలిడిటీ చూపుతోంటే, మరి కొందరికేమో 84 రోజుల వ్యాలిడిటీ చూపుతోంది. కాగా ఈ ఆఫర్ కొరకు వినియోగదారులు మై ఎయిర్ టెల్ యాప్ లో మై ఆఫర్స్ లో చెక్ చేసుకోవాలని సంస్థ సూచిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మై ఎయిర్ టెల్ యాప్ ఇన్ స్టాల్ చేసుకుని మీకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందో లేదో చెక్ చేసుకోండి……

  •  
  •  
  •  
  •  

Comments