జియో కి మరో కౌంటర్ ఇచ్చిన ఎయిర్ టెల్

Wednesday, January 24th, 2018, 12:58:44 PM IST

జియో మొదలైనప్పటి నుండి దేశం మొత్తంగా టెలికాం సంస్థల మధ్య పోటీ ఓ రేంజ్ లో స్టార్ట్ అయ్యింది. వాయిస్ కాల్స్ విషయంలోనే కాకుండా డేటా ప్లాన్స్ విషయంలో కూడా ప్రతి టెలికామ్ సంస్థ జియో కి పోటీని ఇచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా దేశీయ అతిపెద్ద ప్రైవేటు టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ కూడా తన రెగ్యులర్ ప్లాన్స్ లో భారీ మార్పులు చేస్తోంది. రిలయన్స్ జియో తన ప్లాన్స్ ను చాలా వరకు అప్డేట్ చేస్తూ తక్కువ ధరకే అందిస్తుండడంతో ఎయిర్ టెల్ కూడా గట్టి ప్రయత్నమే చేస్తోంది. రిపబ్లిక్ డే సందర్బంగా అన్ని ప్లాన్లలో డేటా విధానంలో మార్పులు చేయగా ఎయిర్ టెల్ కూడా అదే తరహాలోఅఫర్ ఇచ్చింది. రూ.199 (28 రోజులు) అలాగే రూ.448(82) – రూ.509(90) ప్యాక్ లపై అదనంగా 1.4 జీబీ డేటాను ఎయిర్ టెల్ అందిస్తోంది. ఇక రోజుకు అన్ లిమిటెడ్ కాల్స్ 100 ఎస్ఎంఎస్ లు ఉచితం అందులో ఎలాంటి మార్పు లేదు.