జియోకి పోటీగా ఎయిర్ టెల్ బంపర్ అఫర్!

Saturday, September 15th, 2018, 08:20:55 PM IST

గతంలో ఎప్పుడు లేని విధంగా టెలికాం రంగంలో ప్రస్తుతం నెలకొన్న పోటీ ఏ స్థాయిలో ఉందొ అందరికి తెలిసిందే. జియో దెబ్బకు టాప్ కంపెనీలన్నీ ఒక్కసారిగా ఊహించని షాక్ కి గురయ్యాయి. ప్రజల్లో ఇంటర్నెట్ పై అవగాహనా రావడానికి ఎక్కువగా జియో కారణమైందని చెప్పవచ్చు. ఇకపోతే ఇప్పుడున్న ఆఫర్స్ మర్చిపోయేలా జియో ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉంది. ఇకపోతే జియోకి పోటీని ఇవ్వడానికి మిగతా సంస్థలు శక్తికి మించి కష్టపడుతున్నాయి. ముఖ్యంగా ఎయిర్ టెల్ ఒక్కటే జియోకి బలమైన పోటీని ఇచ్చిందని చెప్పాలి.

ఎప్పటికప్పుడు ఆఫర్స్ ను ప్రకటిస్తూ జనాలను ఆకర్షిస్తోంది. రీసెంట్ గా 97 రూపాయలతో కాంబో రీఛార్జ్ ని వదిలిన ఎయిర్ టెల్ 419 పేరుతో సరికొత్త అఫర్ ను ప్రకటించారు. రూ.399 ప్లాన్ లో ఉండే ప్రయోజనాలతో పాటు అధికంగా ఐదు రోజులు చెల్లుబాటు ఇందులో ప్రత్యేకత. ఎటువంటి (యఫ్ యూపీ) పరిమితి లేకుండా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. డైలీ 1.4జీబీ డేటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ ఫ్రీ. దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు ఈ ఆఫర్ ని ఉపయోగించుకోవచ్చు. రానున్న రోజుల్లో జియో కస్టమర్లను తనవైపుకు తిప్పుకునేలా ఎయిర్ టెల్ మరిన్ని ఆఫర్స్ ను ప్రకటించనున్నట్లు సమాచారం.