ఈ పరిస్థితులలో హీరో అజిత్ శశికళ ను ఎందుకు కలిసాడు..?

Wednesday, December 28th, 2016, 03:25:10 AM IST

ajith-sasikala
తమిళనాడులో రాజకీయాలు ఎవరికీ అంతుబట్టని ప్రశ్నగా కొనసాగుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం వరకు అంతా శశికళకు అనుకూలంగానే ఉన్న పరిణామాలు ఒక్కసారిగా ప్రతికూలంగా మారినట్టు కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో తమిళ టాప్ హీరో అజిత్ శశికళను కలవడం చర్చనీయాంశంగా మారింది. శశికళ అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టడానికే అజిత్ మద్దతు కోసం ఈ భేటీ జరిగినట్లు భావిస్తున్నారు.

పోయెస్ గార్డెన్ లో అజిత్, శశికళ సమావేశం అయ్యినట్టు అన్నాడీఎంకే వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగినట్టు ఆ వర్గాలు చెప్పాయి. అయితే హీరో అజిత్ మాత్రం ఈ కథనాలను ధ్రువీకరించడం లేదని తెలుస్తుంది. జయలలిత అంటే అజిత్ కు చాలా గౌరవం. ఆమె మరణించినపుడు కూడా విదేశాల నుండి హుటాహుటిన చెన్నై చేరుకొని ఆమెకు నివాళులర్పించారు. తాజాగా క్రిస్మస్ పండుగను కుటుంబ సభ్యులతో సెలెబ్రేట్ చేసుకోవడానికి బల్గెరియా నుండి చెన్నై చేరుకున్నారు అజిత్. ప్రస్తుతం శశికళతో భేటీ విషయంపై అజిత్ స్పందించక పోవడంతో అసలు నిజం ఏంటన్నది తెలియట్లేదు.

  •  
  •  
  •  
  •  

Comments