యువరాజ్ మరదలి సంచలన ఆరోపణ..అతడికి ఆ అలవాటుందట..!!

Wednesday, November 2nd, 2016, 09:22:54 AM IST

akanksha-sharma
ఆకాంక్ష శర్మ..కొద్ది రోజుల క్రితం వరకు ఈమె పెద్దగా ఎవరికీ తెలియదు.బిగ్ బాస్ షోలో క్రికెటర్ యువరాజ్ సింగ్ కుటుంబం పై ఆరోపణలు చేసి సడెన్ గా వార్తల్లో నిలిచింది. ఈమె యువరాజ్ తమ్ముడికి మాజీ భార్య .తాను తన భర్త నుండి విడిపోవడానికి కారణం యువరాజ్ తల్లే అని ఆరోపించిన విషయం తెలిసిందే.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పెద్ద బాంబునే పేల్చింది. యువరాజ్ సింగ్ కు గంజాయి తాగే అలవాటు ఉందని సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయం స్వయంగా యువరాజే తనతో చెప్పాడని ఆకాంక్ష తెలపడం విశేషం.

యువరాజ్ కుటుంబం లో తనకు వేధింపులు ఎప్పుడూ ఉండేవంటూ ఆరోపించింది. ఆ వేధింపులు తట్టుకోలేక తనుకూడా తన భర్త తో కలసి గంజాయి తాగాల్సివచ్చిందని ఆకాంక్ష శర్మ ఆరోపించింది.యువరాజ్ తల్లే తనని ప్రధానంగా వేధించేదని ఆరోపించింది.యువరాజ్ కుటుంబం నుంచి తానూ ఏమీ ఆశించడం లేదని , తనకు విడాకులు ఇస్తే చాలని ఆకాంక్ష తెలిపింది.