అంబానీ కొడుకు నిశ్చితార్థం… చుస్తే మతి పోవాల్సిందే

Sunday, March 25th, 2018, 02:21:03 PM IST

ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ – శ్లోకా మెహతాల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ నెల 24న గోవాలో కేవలం ఆయన అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకను నిర్వహించారు. ఆకాశ్, శ్లోకాలు చిన్ననాటి స్నేహితులు. ధీరూబాయ్ అంబానీ స్కూల్‌లో ఇద్దరూ కలిసే చదువుకున్నారు. శ్లోకా ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల కంపెనీ రోజీ బ్లూ డైమండ్స్‌ సంస్థ అధినేత రసెల్‌ మెహతా కుమార్తె. డిసెంబర్‌లో వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రస్తుత సమాచారం.

లండన్‌లోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో ఎకనమిక్స్‌లో పట్టా పొందిన శ్లోకా మెహతా.. ప్రస్తుతం తమ డైమండ్ కంపెనీలో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. అంతేగా ఆమె కనెక్ట్‌ఫర్ అనే సంస్థ సహ ఫౌండర్ కూడా. ఇది ముంబైవాసుల సౌకర్యార్థం ఏర్పాటైన సంస్థ. మరోవైపు ఆకాశ్ రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్‌లకు సంబంధించిన వ్యవహారాలను అన్నీ తానై చూసుకుంటున్నాడు.

ఆకాశ్ – శ్లోకాల నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ జంటకు పలువురు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.